సైకిల్‌పై రయ్యిమంటూ వెళ్తోన్న యువకుడు.. అంతలోనే పొదల్లో నుంచి ఊహించని దాడి.. వెన్నులో వణుకు పుట్టిస్తోన్న వీడియో..

Viral Video: ప్రమాదం ఎప్పుడు, ఎలా, ఎక్కడి నుంచి దూసుకొస్తుందో ఎవరం ఊహించలేం. గాల్లో దీపంలాంటివి మనిషి జీవితాలు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వాళ్లం అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటాం. కలలో కూడా ఊహించని ప్రమాదం...

సైకిల్‌పై రయ్యిమంటూ వెళ్తోన్న యువకుడు.. అంతలోనే పొదల్లో నుంచి ఊహించని దాడి.. వెన్నులో వణుకు పుట్టిస్తోన్న వీడియో..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 11, 2022 | 5:07 PM

Viral Video: ప్రమాదం ఎప్పుడు, ఎలా, ఎక్కడి నుంచి దూసుకొస్తుందో ఎవరం ఊహించలేం. గాల్లో దీపంలాంటివి మనిషి జీవితాలు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వాళ్లం అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటాం. కలలో కూడా ఊహించని ప్రమాదం కళ్ల ముందుకొస్తుంది. అయితే ఈ భూమిపై నాలుగు నూకలు తినే బాకీ ఉండాలే కానీ ఎంతటి ప్రమాదమైనా పరార్‌ కావాల్సిందే. అదృష్టం ముందు చావు కూడా తోక ముడవాల్సిందే. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.

వివరాల్లోకి వెళితే ఓ యువకుడు సైకిల్‌పై జాలీగా రయ్యు రయ్యు మంటూ దూసుకుపోతున్నాడు. అదే సమయంలో రోడ్డు పక్కన చెట్ల పొదల్లో నుంచి ఒక్కసారిగా ఒక చిరుత దూసుకొచ్చింది. రెప్పపాటు క్షణంలో సైకిల్‌పై వెళ్తోన్న యువకుడి కాలును కరిచేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కుర్రాడి అదృష్టం బాగుండో.. లేదా చిరుత పట్టు తప్పడం వల్లో కానీ యువకుడి కాలు పులి నోటికి చిక్కలేదు.

పులి అటాక్ వీడియో..

ఇవి కూడా చదవండి

పులి ఒక్కసారి అటాక్‌ చేయడంతో సదరు కుర్రాడు సైకిల్‌తో సహా కింద పడిపోయాడు. అయితే అదే సమయంలో ఓ రెడ్‌ కలర్‌ స్విఫ్ట్‌ కారు అటుగా వచ్చింది. పులిని చూసిన సదరు కారు డ్రైవర్‌ గట్టిగా హారన్‌ కొట్టడంతో పులి ఒక్కసారిగా మళ్లీ చెట్లలోకి పారిపోయింది. దీంతో బతుకు జీవుడా అంటూ సైకిల్‌ను వెనక్కి తిప్పి అక్కడి నుంచి యువకుడు పరుగుపెట్టాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీ టీవీ కెమెరాలో రికార్డైంది. దీంతో వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆ యువకుడి అదృష్టవంతుడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సంఘటన గతంలో ఎప్పుడో జరిగినప్పటికీ తాజాగా మళ్లీ నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?