Viral: ఎప్పుడూ లేని విధంగా ఓ పల్లెటూరి మహిళకు వచ్చిన ఉత్తరం.. ఓపెన్ చేసి చూడగా

తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేశాడు. కానీ ఆ ఫీలింగ్ మనసును వెంటాడుతూనే ఉంది. చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే...

Viral: ఎప్పుడూ లేని విధంగా ఓ పల్లెటూరి మహిళకు వచ్చిన ఉత్తరం.. ఓపెన్ చేసి చూడగా
Thief Apology Letter
Follow us

|

Updated on: Aug 11, 2022 | 3:33 PM

Trending: చిన్న గుండు పిన్ను దొంగతనం చేసినా దొంగే.. కోటాను కోట్లు నొక్కేసినా దొంగే.. ఎందుకంటే అక్కడ చూడాల్సింది పోయిన సంపదనో, వస్తువునో కాదు.. ఎత్తుకెళ్లినోడి బుద్ధిని. కాగా పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు పెద్దలు. తప్పు చేసిన తర్వాత.. తనది పొరపాటు అని తెలుసుకుని.. క్షమాపణ కోరితే ఆ వ్యక్తిని నిజంగా క్షమించాల్సిందే. కానీ అలాంటి వ్యక్తులు ఇప్పటి సమాజంలో చాలా అరుదనే చెప్పాలి. అయితే తాజాగా కేరళ(kerala) ఓ వ్యక్తి రాసిన క్షమాపణ లేక ఇప్పుడు చర్చనీయాంశమైంది. మేరీ అనే మహిళ వయనాడ్ జిల్లా(Wayanad district) పుల్పల్లి దగ్గరల్లోని పట్టనికూప్​‌లో నివాసం ఉంటుంది. ఆమె భర్త జోసెఫ్ చాలా ఏళ్ల క్రితమే కాలం చేశాడు. అప్పుడు నుంచి ఒంటరిగానే జీవనం సాగిస్తుంది. పిల్లలు, మనుమళ్లు, మనవరాళ్లు అప్పుడప్పు వచ్చి ఆమెను చూసి వెళ్తారు అంతే. ఎప్పుడూ లేనిది అనూహ్యంగా ఆమెకు పోస్ట్‌లో ఉత్తరం వచ్చింది. అసలు ఆ లేఖ ఎవరు పంపి ఉంటారో ఆమెకు అర్థం కాలేదు. కార్డుపైన చూస్తే పంపినవారి అడ్రస్ లేదు. దీంతో కాస్త కంగారుగానే ఆ లెటర్ ఓపెన్ చేసింది. లోపల ఓ లెటర్‌తో పాటు, 2000 వేల రూపాయల నగదు ఉంది. ఆ ఉత్తరంలోని సారాశం ఇలా ఉంది.

” సోదరి మేరీ అక్క నువ్వు బాగానే ఉన్నావని అనుకుంటున్నా. జోసెఫ్ బ్రతికి ఉన్న సమయంలో అతని వద్ద నుంచి సుమారు 700 రూపాయలు విలువ చేసే వస్తువులు చోరీ చేశా. ఇప్పుడు వాటి విలువ రమారమి 2 వేల వరకు ఉంటుంది. ఇప్పుడు ఆ డబ్బు పంపుతున్నా. దయచేసి నన్ను మన్నించు” అని రాసి ఉంది. తన భర్త లేనందున ఆ లెటర్ ఎవరు రాశారో కనుగొనలేనని మేరీ తెలిపింది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో దొంగనతం చేసినా.. ఇలా తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం తనకు గొప్పగా అనిపించిందని ఆమె వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..