Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Steel plant IT raid : కళ్లు చెదిరే రేంజ్‌లో 100 కార్లతో బరాత్.. అధికారుల ఎంట్రీతో బయటపడిన దిమ్మతిరిగే ట్విస్ట్

ఈ ఆపరేషన్‌లో దాదాపు 400 మందికి పైగా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆదాయపు పన్ను శాఖ తన బృందాన్ని ఐదు వేర్వేరు భాగాలుగా విభజించి 100కు పైగా వాహనాలను దాడులకు వినియోగించింది.

Steel plant IT raid : కళ్లు చెదిరే రేంజ్‌లో 100 కార్లతో బరాత్.. అధికారుల ఎంట్రీతో బయటపడిన దిమ్మతిరిగే ట్విస్ట్
Untitled 1
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 11, 2022 | 3:40 PM

Steel plant IT raid : ‘రాహుల్ వెడ్స్ అంజలి’ అంటూ స్టిక్కర్లు అంటించిన పెళ్లి వాహనాలు రోడ్డుపై భారీగా క్యూ కట్టాయి. సుమారు 100 కి పైగా పెళ్లి వాహనాలతో ఊరేగింపు సాగుతోంది. ఇంత పొడవున్న కార్ల క్యూ చూసి జనం కూడా ఆశ్చర్యపోయారు. ఎవరో గొప్పింటి పెళ్లి ఊరేగింపు జరుగుతోందని, అందులో భాగంగానే చాలా మంది బంధువులు, ఊరేగింపు వాహనాలతో పాల్గొని ఉంటారని అందరూ భావించారు. అయితే, ఆ బరాత్‌ తర్వాత బయటపడ్డ అసలు విషయం తెలిసి అందరు నోరెళ్ల బెట్టారు. అక్కడ జరిగింది చూసిన ప్రతి ఒక్కరూ తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

మహారాష్ట్రలోని జల్నాలో ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో ఉక్కు వ్యాపారి, రియల్ ఎస్టేట్ డెవలపర్‌కు చెందిన సుమారు రూ.100 కోట్ల విలువైన బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో రూ.56 కోట్ల నగదు, 32 కేజీల బంగారం, వజ్రాలు, ముత్యాలు, ఆస్తుల పత్రాలు ఉన్నాయి. ఇంత భారీ మొత్తంలో నగదును లెక్కించడానికి 13 గంటలకు పైగా సమయం పట్టింది అధికారులకు. ఆగస్టు 1 నుంచి 8వ తేదీ మధ్య ఆదాయపు పన్ను శాఖ ఈ దాడులు జరిపినట్టుగా తెలిసింది. అయితే మరికొన్ని చోట్ల దాడులు కొనసాగుతున్నాయి.

ఈ ఆపరేషన్‌లో దాదాపు 400 మందికి పైగా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆదాయపు పన్ను శాఖ తన బృందాన్ని ఐదు వేర్వేరు భాగాలుగా విభజించి 100కు పైగా వాహనాలను దాడులకు వినియోగించింది. వస్త్ర, ఉక్కు వ్యాపారి ఇంట్లో దొరికిన నగదును జాల్నాలోని స్థానిక స్టేట్ బ్యాంక్ శాఖకు తీసుకెళ్లి లెక్కించారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి నగదు లెక్కింపు ప్రారంభం కాగా రాత్రి ఒంటి గంట వరకు నగదు లెక్కింపు పనులు ముగిశాయి.

ఇవి కూడా చదవండి

అయితే, ఆదాయపు పన్ను శాఖ బృందం రైడ్ కోసం ‘దుల్హన్ హమ్ లే జాయేంగే’ స్టిక్కర్ ఉన్న వాహనాన్ని ఉపయోగించి దాడులు చేయడానికి అద్భుతమైన ప్రణాళికను రూపొందించింది. ఆదాయపు పన్ను శాఖ.. ఈ రైడ్‌ను చాలా గోప్యంగా ఉంచి..ఈ వాహనాలు పెళ్లికి వెళ్తున్నట్లు తెలిసేలా ‘దుల్హన్ హమ్ లే జాయేంగే’ పేరుతో “రాహుల్‌ వెడ్స్‌ అంజలి’ పేరుతో తమ వాహనాలపై స్టిక్కర్లు అతికించారు.

వాహనాలు ఎవరి పెళ్లికి వెళ్తున్నాయని ప్రజలు ఆతృతగా ఎదురు చూశారు. కానీ, సినిమా స్టైల్‌లో జరిగిన దాడుల్లో ఆదాయపు పన్ను శాఖ పెద్ద విజయం సాధించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి