Raksha Bandhan: ప్రధాని నివాసంలో రక్షాబంధన్ వేడుకలు.. మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు.. వారు ఎవరంటే..
Raksha Bandhan: సోదరులపై అక్కా చెల్లెళ్లు ప్రత్యేక ప్రేమను చాటుతూ రక్షాబంధన్‌ను జరుపుకోవడం ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తోంది. ఆడపడుచులు రాఖీ కడుతూ ఈ పండగను..
Raksha Bandhan: సోదరులపై అక్కా చెల్లెళ్లు ప్రత్యేక ప్రేమను చాటుతూ రక్షాబంధన్‌ను జరుపుకోవడం ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తోంది. ఆడపడుచులు రాఖీ కడుతూ ఈ పండగను ఆనందోత్సవాల మధ్య జరుపుకొంటారు. ఈ పండగ రోజున సోదరులు కూడా వారిపై ప్రత్యేక ప్రేమానురాగాలను చూపిస్తారు. రాఖీ పండగ రోజున సోదరుడు – సోదరి మధ్య పవిత్ర ప్రేమానుబంధాన్ని సూచిస్తుంది. ఈ పండగ సోదరభావాన్ని తెలిజేస్తుంది. సోదరిలు సోదరులకు రాఖీ కట్టి దీర్ఘాయువు, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఈ రాఖీ పండగ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తన నివాసంలో బాలికతో ఘనంగా జరుపుకొన్నారు. ప్రధాని కార్యాలయంలో పని చేస్తున్న తోటమాలి, స్వీపర్స్, ఫ్యూన్లు, డ్రైవర్లు, ఇతర సిబ్బంది కుమార్తెలు ప్రధాని మోడీకి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వారిని నవ్వుతూ పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A very special Raksha Bandhan with these youngsters… pic.twitter.com/mcEbq9lmpx
— Narendra Modi (@narendramodi) August 11, 2022
ప్రధాని మోడీ నివాసానికి వెళ్లిన బాలికలు మోడీకి రాఖీ పట్టడం ఈ వీడియోలో చూడవచ్చు. రాఖీ కట్టేందుకు బాలికలు ఒక్కొక్కరు ముందుకు వస్తుండగా, ప్రధాని వారితో సంభాషించడం చూడవచ్చు. ఈ సందర్భంగా బాలికలకు మోడీ ఆశీస్సులు అందించారు.
#WATCH | Prime Minister Narendra Modi celebrated #RakshaBandhan with young girls today at his residence in Delhi.
This was a special Rakshabandhan as these girls were the daughters of sweepers, peons, gardeners, drivers, etc working at PMO.
(Video Source: PMO) pic.twitter.com/eSvd6gsgHb
— ANI (@ANI) August 11, 2022
ఈ సందర్భంగా మోడీ చిన్నారులతో కొంత సేపు ముచ్చటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి