Rakhi Festival: రాఖీని నేడు లేదా రేపు ఎప్పుడు ఏ సమయంలో కట్టాలి.. శుభ ముహర్తం గురించి తెలుసుకోండి..

ఏడాది పొడవునా అక్కాచెల్లెళ్లు ఎదురుచూసే రాఖీ పండుగ, ఈ ఏడాది పూర్ణమిపై భద్ర నీడ పడింది. ఈ సందర్భంగా రాఖీ పండగ జరుపుకోవడానికి శుభ ముహూర్తాల విషయంలో గందరగోళం నెలకొంది. సోదరులకు ఎప్పుడు సోదరీమణులు రాఖీ కట్టే శుభ ముహర్తం గురించి పండితులు చెప్పిన సలహాలు తెలుసుకోండి

Rakhi Festival: రాఖీని నేడు లేదా రేపు ఎప్పుడు ఏ సమయంలో కట్టాలి.. శుభ ముహర్తం గురించి తెలుసుకోండి..
Rakhi Festival
Follow us
Surya Kala

| Edited By: Team Veegam

Updated on: Aug 11, 2022 | 1:45 PM

Rakhi Festival: శ్రావణ మాసంలో పండుగల సందడి నెలకొంది. రాఖీ పండగను పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో నేడు రేపు పౌర్ణమి గడియాలున్నాయి. ఈరోజు పౌర్ణమి భద్రుని నీడ సమయంలో వచ్చింది కనుక ఈరోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు. ఫలితంగా..  రాఖీ పండగ ఎప్పుడు జరుపుకోవాలి.. శుభ సమయం ఎప్పుడు అనే సందేహం అందరిలోనూ నెలకొంది. అన్న దమ్ములకు ఏ రోజు, ఏ సమయంలో రాఖీ కట్టాలి అనే ప్రశ్న అక్కాచెల్లెళ్ల మదిలోనూ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మీ మనస్సులో  రాఖీ పండగ గురించి ఇదే ప్రశ్న ఉంటే… దేశంలోని ప్రధాన  పండితుల అభిప్రాయం ప్రకారం రాఖీ పండగక్కి శుభసమయం గురించి తెలుసుకుందాం..

కాశీలోని పండితులు ఏమంటున్నారంటే కాశీ విద్వత్ పరిషత్ ప్రకారం.. ఉదయం 10:38 నుండి 08:26 వరకు గందరగోళంగా ఉంది. కాశీ విశ్వనాథ ఆలయ విశిష్ట సభ్యుడు,  ప్రసిద్ధ జ్యోతిష్కుడు పండిట్ దీపక్ మాల్వియా ప్రకారం.. పవిత్రమైన రాఖీ పండుగ రోజున.. సోదరీమణులు 08:26 నుంచి 12:00 మధ్య వారి సోదరుడి మణికట్టుపై రాఖీని కట్టాలి. సోదరీమణులు మధ్యాహ్నం 12:00 గంటల తర్వాత రాఖీ కట్టకూడదని గుర్తుంచుకోమని చెప్పారు

ఉత్తరాఖండ్ జ్యోతిష్యుల అభిప్రాయం ఉత్తరాఖండ్ జ్యోతిష్ పరిషత్ అధ్యక్షుడు పండిట్ రమేష్ సెమ్వాల్ ప్రకారం, ఈ సంవత్సరం రక్షాబంధన్ పండుగను 11 ఆగస్టు 2022 న మాత్రమే జరుపుకోవాలని చెప్పారు. ఎందుకంటే మధ్యాహ్నం వ్యాపిని పూర్ణిమలో భద్ర దోషం ఉంది. ఈ రోజు సూర్యోదయంతో కూడిన చతుర్దశి తిథి ఉంది.  హరిద్వార్ సమయం ప్రకారం పూర్ణిమ తిథి ఉదయం 10:58 నుండి ప్రారంభమవుతుంది. దీనితో పాటు భద్ర కూడా ఈ రోజు రాత్రి 08:50 వరకు ఉంటుంది. భద్ర సమయంలో శ్రావణి పండుగను జరుపుకోవడానికి గ్రంధాలలో కఠినమైన నిషేధం ఉంది.. అటువంటి పరిస్థితిలో, సోదరీమణులు రాత్రి 08:50 గంటల తర్వాత మాత్రమే వారి సోదరుడి చేతిలో రాఖీ కట్టడం శుభపరిణామం.

ఇవి కూడా చదవండి

భద్ర సమయంలో మరచిపోయి కూడా ఈ పని చేయకూడదు భద్రా సమయంలో కళ్యాణం, క్షవరం, గృహ నిర్మాణ ప్రారంభం, గృహ ప్రవేశం, యాగ్యోపవీతం, రక్షాబంధనం, హోళికాదహనం వంటి కార్యక్రమాలు మొదలైనవి పూర్తిగా నిషేధించబడ్డాయి. భద్ర సమయంలో రాఖీ పండగ జరుపుకుంటే రాజు మరణిస్తాడని.. భద్ర సమయంలో హోలికా దహనం జరిగితే గాదెలో ఉంచిన పంట అగ్ని ఆహుతి అవుతుందని నమ్మకం. భద్ర చెడు ప్రభావం అది నివసించే చోట మాత్రమే పడుతుందని నమ్మకం..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు,  నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)