Vastu Shastra: బాత్‌రూమ్‌లో ఖాళీ బకెట్లు పెడుతున్నారా? ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది..!

Vastu Tips for Bathroom: రోజువారీ జీవితంలో సాధారణమైన కొన్ని విషయాలు, లైట్ తీసుకునే అంశాలు వ్యక్తుల జీవితాలకు హాని కలిగిస్తాయి. ముఖ్యంగా ఇంటి వాస్తు విషయంలో కొన్ని కొన్ని అంశాలను తప్పక పరిగణనలోకి

Vastu Shastra: బాత్‌రూమ్‌లో ఖాళీ బకెట్లు పెడుతున్నారా? ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది..!
Bathroom Vastu
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 13, 2022 | 12:32 PM

Vastu Shastra: రోజువారీ జీవితంలో సాధారణమైన కొన్ని విషయాలు, లైట్ తీసుకునే అంశాలు వ్యక్తుల జీవితాలకు హాని కలిగిస్తాయి. ముఖ్యంగా ఇంటి వాస్తు విషయంలో కొన్ని కొన్ని అంశాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, అందరూ వంటగది, పూజా గది, బెడ్ రూమ్‌ పైనే దృష్టి పెడతారు. కానీ, ఇంట్లో బాత్రూమ్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే చాలా మంది చేసే పెద్ద తప్పు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బాత్రూమ్ విషయంలోనూ వాస్తును పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే.. కుటుంబం ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి రావొచ్చని వార్నింగ్ ఇస్తున్నారు.

వాస్తు ప్రకారం.. బాత్రూమ్ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాష్‌రూమ్‌లో ఉంచిన వస్తువులు వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. చాలా మంది ఇళ్లలో బాత్రూమ్‌లో ఖాళీ బకెట్ ఉంటుంది. ఇది అనేక సమస్యలకు కారణం అవుతుందట. నమ్మశక్యంగా లేనప్పటికీ.. వాస్తు శాస్త్ర పండితులు ఈ విషయాన్ని ఉద్ఘాటించి చెబుతున్నారు. ముఖ్యంగా బాత్రూమ్‌లో ఖాళీ బకెట్.. ఆర్థికంగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే.. ఆ సమస్యను నివారించొచ్చని చెబుతున్నారు వాస్తు నిపుణులు.

బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచవద్దు.. వాస్తు శాస్త్రం ప్రకారం.. వాష్ రూమ్‌లో ఖాళీ బకెట్ ఉంచడం అశుభం. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. అందుకే ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకుని, ఖాళీ బకెట్లు ఉండకుండా చూసుకోండి.

నీలిరంగు బకెట్‌ను నీళ్లతో నింపి ఉంచాలి.. వాస్తు నిపుణులు రోసీ జస్రోటియా ప్రకారం.. బాత్రూమ్‌లో నీలిరంగు బకెట్‌ను ఉంచడం శుభప్రదం. బాత్రూమ్‌లో ఉంచిన బకెట్ ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. బకెట్‌లో ఎల్లప్పుడూ శుభ్రమైన నీటినే ఉంచాలి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో శ్రేయస్సు ఉంటుంది.

నీలం రంగును శుభప్రదం.. వాస్తు ప్రకారం నీలం రంగు చాలా మంచిది. నీలం రంగు సంతోషం, ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణించబడుతుందని జస్రోటియా పేర్కొన్నారు. శని, రాహు దోషం ఉన్నవారు ఎప్పుడూ నీలిరంగు బకెట్‌, నీలిరంగు మగ్‌ని బాత్‌రూమ్‌లో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన రాహువు, శని దుష్ప్రభావాల నుండి కొంత వరకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు.. ఆర్థికంగా మంచి జరగాలంటే బాత్రూంలో బ్లూ టైల్స్ ఉపయోగించాలంటున్నారు.

(గమనిక: మత విశ్వాసాలు, వాస్తు శాస్త్రం ప్రకారం ఈ సమాచారాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..