Headache Remedies: తలనొప్పి వల్ల ఎసిడిటి వస్తుందా..? ఉపశమనానికి అద్భుతమైన ఇంటి చిట్కాలు
Headache Remedies: తలనొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. ఈ కారణాలలో గ్యాస్ సమస్య కూడా ఉండవచ్చు. కడుపులో గ్యాస్ సమస్య ఏర్పడటం వల్ల కూడా తలనొప్పి వస్తుందని వైద్య నిపుణులు..
Headache Remedies: తలనొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. ఈ కారణాలలో గ్యాస్ సమస్య కూడా ఉండవచ్చు. కడుపులో గ్యాస్ సమస్య ఏర్పడటం వల్ల కూడా తలనొప్పి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ వల్ల కలిగే నొప్పి చాలా బాధాకరమైనది. దీని వల్ల మనిషి చాలా ఇబ్బంది పడతాడు. అటువంటి పరిస్థితిలో గ్యాస్ వల్ల కలిగే తలనొప్పి నుండి ఉపశమనం పొందడానికి మీరు కొన్ని ఇంటి నివారణ చిట్కాలను పాటిస్తే ఎంతో మేలంటున్నారు. ఈ హోం రెమెడీస్ ద్వారా మీరు చాలా ప్రయోజనాలను పొందవచ్చు. గ్యాస్ వల్ల వచ్చే తలనొప్పి సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం.
నిమ్మరసం: గ్యాస్ వల్ల వచ్చే తలనొప్పి నుంచి బయటపడేందుకు నిమ్మరసం తీసుకోవచ్చు. లెమన్ వాటర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది కడుపులో గ్యాస్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇది తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి.
మజ్జిగ: మజ్జిగ తాగితే గ్యాస్ వల్ల వచ్చే తలనొప్పి పోతుంది. రోజుకి రెండుసార్లు మజ్జిగ తాగితే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
తులసి ఆకులను నమలండి: గ్యాస్ వల్ల తలనొప్పి వస్తే తులసి ఆకులను నమలండి. తులసి ఆకులలో ఉండే అనాల్జేసిక్ లక్షణాలు తలనొప్పిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
వెల్లుల్లి: వెల్లుల్లి తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది గ్యాస్, పొత్తికడుపు తిమ్మిరి, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి