Health: టైమ్ లేదని గబగబా తినేస్తున్నారా.. పెను సమస్యలు వచ్చే అవకాశం ఉంది.. జాగ్రత్త

పెరిగిపోయిన సాంకేతికత, పని వేళలు, ఆధునిక పోకడలతో లైఫ్ స్టైల్ మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఎంతగా ఉంటే.. ప్రశాంతంగా కూర్చొని భోజనం చేయలేనంతగా.. అందుకే సమయం లేదనో, లేట్...

Health: టైమ్ లేదని గబగబా తినేస్తున్నారా.. పెను సమస్యలు వచ్చే అవకాశం ఉంది.. జాగ్రత్త
Breakfast Health
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 10, 2022 | 1:40 PM

పెరిగిపోయిన సాంకేతికత, పని వేళలు, ఆధునిక పోకడలతో లైఫ్ స్టైల్ మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఎంతగా ఉంటే.. ప్రశాంతంగా కూర్చొని భోజనం చేయలేనంతగా.. అందుకే సమయం లేదనో, లేట్ అవుతుందనో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తూ ఉంటారు. మరి కొందరు మాత్రం గబగబా కానిచ్చేస్తారు. ఎక్కువ శాతం మంది చాలా వేగంగా భోజనం చేస్తుంటారు. కానీ భోజనం వేగంగా చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొందరగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఫాస్ట్ గా తింటే మనకు తెలియకుండానే ఎక్కువ తినేస్తాం. అంతేకాకుండా శరీరానికి పోషకాలు అందకుండా పోతాయి. ఎక్కువ మోతాదులో తినడం వల్ల విపరీతమైన బరువు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ఊబకాయం, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అందుకే నెమ్మదిగా భోజనం చేయాలని సూచిస్తున్నారు. ఎక్కువగా ఆహారం తింటే జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది.

వేగంగా భోజనం చేస్తే ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్ 2 డయాబెటిస్ వస్తుందని పరిశోధకులు వార్నింగ్ ఇస్తున్నారు. త్వరగా ఆహారం తినేస్తే గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. కనుక ఆహారాన్ని నెమ్మదిగా నమిలి మింగాలి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆహారం తిన్న తర్వాత ఒక పది నిమిషాలు నడవాలి. కానీ ఫాస్ట్‌గా నడవడం లేదా జాగింగ్ చేయడం వంటివి చేస్తే కడుపు నొప్పి, ఉబ్బరం కలుగుతుంది. బయటికి వెళ్లాలని మీకు అనిపించకపోతే మీరు ఇంట్లోనే నడవవచ్చు. మీరు భోజనం చేసిన తర్వాత ఉబ్బరంగా ఉంటే నడక చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ ఆర్టికల్ కేవలం హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారం బట్టి ప్రచురించబడింది. దీంతో టీవీ9 వెబ్‌సైట్, టీవీ9కు ఎలాంటి సంబంధం లేదు.