AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken: చికెన్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. రోజూ తింటే ఇలాంటి దుష్ర్పభావాలు తప్పవు..తస్మాత్‌ జాగ్రత్త!

అయితే, రోజూ చికెన్ తీసుకోవడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? మీరు కూడా ప్రతి రోజూ చికెన్ తింటున్నట్టయితే..ఈ

Chicken: చికెన్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. రోజూ తింటే ఇలాంటి దుష్ర్పభావాలు తప్పవు..తస్మాత్‌ జాగ్రత్త!
Chicken
Jyothi Gadda
|

Updated on: Aug 10, 2022 | 4:35 PM

Share

Chicken: నాన్‌వెజ్‌ ప్రియులకు చికెన్ పేరు వింటే చాలు.. నోరూరుతుంది. చాలా మందికి ప్రతిరోజూ చికెన్ పెట్టినా తినేస్తుంటారు..అసలు విసుగు కూడా రాదు..పైగా చికెన్‌ లేనిదే ముద్ద దిగదు మరికొందరికి..ఇక కరోనా మహమ్మారి తర్వాత.. ఇమ్యూనిటీ లెవల్స్‌ పెంచుకోవటం కోసమని..ప్రతిరోజూ కోడిగుడ్డు, చికెన్ తినాలని పోషకాహార నిపుణులే స్వయంగా చెబుతున్నారు. ఇంకేముందు నాన్ వెజ్ ప్రియులు రెచ్చిపోయారు. ప్రతిరోజూ చికెన్ కుమ్మేస్తున్నారు. అయితే, రోజూ చికెన్ తీసుకోవడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? మీరు కూడా ప్రతి రోజూ చికెన్ తింటున్నట్టయితే..ఈ కథనం చివరి వరకు చదవండి.

సరైన పద్ధతిలో చికెన్ తీసుకోవడం వల్ల మీ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి దోహదం చేయకపోవచ్చు. ఇది మీరు దానిని ఎలా వినియోగిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు డీప్‌ఫ్రైడ్ చికెన్‌ని రెగ్యులర్‌గా తీసుకుంటే, మీ కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందనడంలో సందేహం లేదు. వాస్తవానికి, అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో వైట్ మీట్ చికెన్ రెడ్ మీట్ చేసే విధంగా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని కనుగొంది. మీ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి, కాల్చిన, ఉడికించిన, వేయించిన చికెన్ తినడం ఉత్తమం.

చికెన్ అధిక వేడి ఆహారంగా పరిగణించబడుతుంది. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. సరళంగా చెప్పాలంటే ఇది శరీరంలో ‘వేడి’ని కలిగిస్తుంది. దీని కారణంగా కొంతమందికి ముఖ్యంగా వేసవిలో ముక్కు కారటం ఉండవచ్చు. రోజూ చికెన్ తీసుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. క్రమం తప్పకుండా చికెన్ తిన్న తర్వాత ముక్కులో రక్తం కారినట్లు అనిపిస్తే కొన్ని రోజుల గ్యాప్ తర్వాత తినడం మంచిది.

ఇవి కూడా చదవండి

క్రమం తప్పకుండా చికెన్ తినడం వల్ల వచ్చే మరో సైడ్ ఎఫెక్ట్ బరువు పెరగడం. చికెన్ బిర్యానీ, బటర్ చికెన్, ఫ్రైడ్ చికెన్, మరెన్నో ఆహార పదార్థాలు అధిక కేలరీల ఆహార పదార్థాలు బరువు పెరిగేలా చేస్తాయి. చికెన్ బిర్యానీ, బటర్ చికెన్, ఫ్రైడ్ చికెన్ మరెన్నో ఆహార పదార్థాలు అధిక కేలరీలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు విపరీతంగా పెరుగుతారు. వీటిని అప్పుడప్పుడు తీసుకోవడం మంచింది. రెగ్యులర్ తింటే మాత్రం ఖచ్చితంగా బరువు పెరగడానికి దారి తీస్తుంది. అలాగే కొలెస్ట్రాల్‌ని కూడా విపరీతంగా పెంచుతుంది.

యూరినరీ ఇన్‌ఫెక్షన్స్.. కొన్ని రకాల చికెన్‌లు యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌లు లేదా UTIకి కూడా సంబంధం కలిగి ఉంటాయి. అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ జర్నల్ mBio స్టడీ ప్రకారం, E.coli నిర్దిష్ట జాతితో కూడిన చికెన్ UTIతో సహా అనేక రకాల ఇన్ఫెక్షన్‌లకు కారణమవుతుందని తేల్చింది. ఇలాంటి ఇన్ఫెక్షన్లను నివారించాలంటే మాత్రం యాంటీబయాటిక్స్ వాడకుండా ఉన్న చికెన్ తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us