AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: తోడబుట్టినవాడే తోడేలై కాటువేస్తే.. రాఖీ పండుగకు ఒక్కరోజు ముందుగానే దారుణం..

చెల్లెల్ని సొంత అన్నే వేధించిన దారుణ ఘటన చోటుచేసుకుంది. తోడబుట్టిన వాడే తోడేలై కాటువేయటంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ చెల్లెలు బలవన్మరణానికి పాల్పడింది. తల్లికి తెలిసినా..

Maharashtra: తోడబుట్టినవాడే తోడేలై కాటువేస్తే.. రాఖీ పండుగకు ఒక్కరోజు ముందుగానే దారుణం..
Harassment
Jyothi Gadda
|

Updated on: Aug 10, 2022 | 3:21 PM

Share

maharashtra: అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ మధ్య విడదీయరాని బంధాల పండుగగా పేరొందినది రాఖీపండగ..అదే రక్షాబంధన్.. పండుగకు మరికొద్ది గంటల సమయం ఉందనగా.. వైజాపూర్ తాలూకాలోని విర్‌గావ్‌లో ఆ బంధానికి,బంధుత్వానికి గండికొట్టే సంఘటన ఒకటి తెరపైకి వచ్చింది. చెల్లెల్ని సొంత అన్నే వేధించిన దారుణ ఘటన చోటుచేసుకుంది. తోడబుట్టిన వాడే తోడేలై కాటువేయటంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ చెల్లెలు బలవన్మరణానికి పాల్పడింది. తల్లికి తెలిసినా తనకు న్యాయం జరగలేదనే మనస్తాపంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. నిందితుడిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఔరంగాబాద్‌లోని వైజాపూర్‌ తాలూకాలోని విర్‌గావ్‌కు చెందిన బాధిత యువతి..నిందితుడు ఇద్దరూ అన్నాచెల్లెలు. తొమ్మిది నెలల క్రితం బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు అక్కడికి వెళ్లాడు. ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని అవకాశంగా తీసుకుని ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే..చంపేస్తానని బెదిరించాడు. బెదిరింపులకు భయపడిన బాధితురాలు ఎవరికీ చెప్పలేదు. దాంతో అతడు మరింత రెచ్చిపోయాడు..చెల్లెలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు బాధితురాలు గర్భం దాల్చింది.

ఈ విషయం తల్లికి తెలియడంతో తల్లి ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. సమాజంలో పరువు పోతుందేమోనని ఆ తల్లి కూడా గుట్టుబయటకు రాకుండా లో లోపలే భయపడుతూ, ఆందోళనకు గురైంది. అలా..నిత్యం ఒత్తిడికి లోనవుతున్న బాధిత మైనర్ బాలిక పొలానిక చల్లే విషపు గుళికలు నీళ్లలో కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న బీర్‌గావ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. పోక్సో,ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేశారు. రాఖీ పండగకు ఒక్కరోజు ముందు జరిగిన ఈ అమానవీయ ఘటన అందరినీ కలచివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి