AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నడిరోడ్డుపై మామను చెప్పుతో చితకబాదిన కోడలు.. సాయం చేసిన తండ్రి, అన్న

ఈ మొత్తం సంఘటన హైవే మధ్య కూడలి వద్ద పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే జరిగింది. ఇదంతా వీడియోతీసిన కొందరు స్థానికులు సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు.

Viral Video: నడిరోడ్డుపై మామను చెప్పుతో చితకబాదిన కోడలు.. సాయం చేసిన తండ్రి, అన్న
Father In Law
Jyothi Gadda
|

Updated on: Aug 09, 2022 | 8:34 PM

Share

Viral Video: ఓ మహిళ తన మామగారిని చెప్పులతో నిర్దాక్షిణ్యంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఒక మహిళ తన తండ్రి, సోదరుడితో కలిసి వృద్ధుడిని కొట్టిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో వెలుగుచూసింది. చెప్పులు, పంచ్‌లతో కొట్టడమే కాకుండా నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ముగ్గురు కలిసి కనికరం లేకుండా కొట్టడంతో వృద్ధుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఈ మొత్తం సంఘటన హైవే మధ్య కూడలి వద్ద పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే జరిగింది. ఇదంతా వీడియోతీసిన కొందరు స్థానికులు సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దాంతో వీడియో కాస్త వైరల్‌ అవుతోంది.

వైరల్‌ అవుతున్న వీడియోలో…సోదరుడు తన సోదరిని ఎందుకు కొట్టావు అని వృద్ధుడిని పదేపదే అడిగాడు “నా సోదరి ఏం తప్పు చేసింది.ఎందుకు ఆమెను కొట్టావు..అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఇంతలో ఆ వ్యక్తి సహాయం కోసం వేడుకుంటున్నాడు.. కానీ, ముగ్గురూ కనికరం చూపలేదు. అతనిని కొట్టడం, తన్నడం చేస్తూనే ఉన్నారు. ఈ వీడియో వైరల్‌గా మారిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే ఆ మహిళను, ఆమె తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆమె సోదరుడు పరారీలో ఉన్నట్టు తెలిసింది. అతడి కోసం పోలీసులు గాలిస్లున్నారు. కాగా, గాయపడిన వ్యక్తిని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

గాయపడిన సుఖ్‌దేవ్ సింగ్ యాదవ్ కుమారుడు బబ్లూ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. కాసేపటి క్రితం తన తమ్ముడు మరణించాడని తెలిపారు. అతని భార్య పుష్ప, సోదరుడు కమలేష్, అతని తండ్రి రామ్ విలాస్, సుఖ్ దేవ్ సింగ్ మొత్తం ఆస్తిని ఆమె పేరు మీద బదిలీ చేయాలని కోరుకున్నారు. తన ఆస్తిని విభజించాలని కోడలు డిమాండ్ చేస్తోందని, అందుకు తాను ఒప్పుకోలేదని వృద్ధుడు చెప్పాడు.  ఆమె ఉండేందుకు ఓ గది కూడా ఇచ్చాడు. కానీ,

ఇవి కూడా చదవండి

ఆమె సంతృప్తి చెందకపోవడంతో తన మామగారిని కొట్టడానికి కుటుంబ సభ్యులను పిలిపించిదని వాపోయాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!