Telangana: నల్లగొండలో దారుణం.. ప్రేమ పేరుతో వేధింపులు.. యువతిపై కత్తితో దాడి
ప్రేమ పేరుతో వేధిస్తూ పట్టపగలే ఓ యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన
Nallagonda dist: నల్లగొండ పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో వేధిస్తూ పట్టపగలే ఓ యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీటీఎస్ ఫారెస్ట్ పార్కులో మంగళవారం చోటుచేసుకుంది. యువతిపై దాడి చేసిన యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
నల్లగొండలోని దేవరకొండ రోడ్డు లో నివసిస్తున్న రోహిత్ ఎన్జీ కాలేజీలో బీబీఏ సెకండియర్ చదువుతున్నాడు. రోహిత్ గత ఏడు నెలల నుంచి పానగల్‌కు చెందిన నవ్య అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టుగా తెలిసింది. మొహర్రం సందర్భంగా సెలవు కావడంతో నవ్య ఆమె స్నేహితురాలితో కలిసి ఫారెస్ట్ పార్క్‌లో మరో అనే స్నేహితుడిని కలిసేందుకు వచ్చారు. రోహిత్ కూడా అక్కడకు వచ్చాడు. నవ్య తో రోహిత్ మాట్లాడాలని చెబుతూ..తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కడుపులో, చేతులపై, కాళ్ళపై, మొహంపై పొడిచి, అక్కడి నుంచి తన వెంట తెచ్చుకున్న వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పారిపోయినట్టుగా స్థానికులు చెప్పారు. బాధిత యువతిని వైద్యం కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నేరస్థుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి