Chickenpox,Monkeypox: హడలెత్తిస్తున్న మంకీ పాక్స్.. వెంటాడుతున్న చికెన్‌ పాక్స్.. ఎలా గుర్తించాలో చెబుతున్న వైద్యులు..!!

అయితే, మంకీ పాక్స్, చికెన్ పాక్స్ కు మధ్య స్పష్టమైన తేడాలే ఉన్నాయంటున్నారు వైద్యులు. ఈ రెండూ వైరస్ వల్లే వస్తున్నా.. చూడటానికి ఒకే లా కనిపిస్తున్నా.. వీటి మధ్య..

Chickenpox,Monkeypox: హడలెత్తిస్తున్న మంకీ పాక్స్.. వెంటాడుతున్న చికెన్‌ పాక్స్.. ఎలా గుర్తించాలో చెబుతున్న వైద్యులు..!!
Monkeypox
Follow us
Jyothi Gadda

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 13, 2022 | 12:37 PM

Chickenpox,Monkeypox: కరోనా తరువాత.. వైరస్ పేరు వింటనే ప్రజలు వణికిపోతున్నారు. అందుకే, మంకీపాక్స్ భయం గడగడలాడిస్తోంది. కేసుల సంఖ్య అంతగా లేకపోయినా… ఈ పేరుచెబితే మరో పెను విపత్తులా బెంబేలెత్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చికెన్ పాక్స్ కేసులు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ రెండూ చూడటానికి ఒకేలా కనిపించడంతో ఏది మంకీ పాక్సో, ఏది చికెన్‌ పాక్సో తెలియక.. జనం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇంతకీ ఏది మంకీపాక్స్! ఏది చికెన్ పాక్స్!! ఈ రెంటింటికీ మధ్య తేడా ఎలా గుర్తించాలి?? ఇవే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఇలాంటి సందేహలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..

ఒంటిపై దద్దుర్లు.. బొబ్బలు వస్తే చాలు జనం పరుగులు పెడుతున్నారు. ఏ చిన్న మార్పు ఒంటిపై కనిపించినా.. మంకీపాక్స్‌ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. చర్మం మీద చిన్న పొక్కు మొలిచినా మంకీపాక్స్‌ ఇదేనేమో..అని భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆటలమ్మ (చికెన్‌పాక్స్‌) ఇన్‌ఫెక్షన్‌ హడలెత్తిస్తోంది. అయితే… రెండున్నరేళ్లుగా కొవిడ్‌ బాధలను అనుభవిస్తున్న జనాలకు కొత్తగా ఏదైనా జబ్బు విజృంభిస్తోందంటే భయం కలగటంలో ఆశ్చర్యం లేదనే చెప్పాలి.

అయితే, మంకీ పాక్స్, చికెన్ పాక్స్ కు మధ్య స్పష్టమైన తేడాలే ఉన్నాయంటున్నారు వైద్యులు. ఈ రెండూ వైరస్ వల్లే వస్తున్నా.. చూడటానికి ఒకే లా కనిపిస్తున్నా.. వీటి మధ్య చాలా పెద్ద తేడా ఉందంటున్నారు. మంకీ పాక్స్ ..అనేది పాండమిక్. చికెన్ పాక్స్ అనేది సీజనల్ డిసీజ్. దీన్ని బేసిక్ గా అంచనా వేయాల్సి ఉందంటోంది వైద్య ప్రపంచం. మంకీపాక్స్, చికెన్ పాక్స్ రెండూ వైరస్ వల్ల వచ్చే వే అయినా.. వీటి వైరస్ ల్లో తేడా ఉందని స్పష్టం చేస్తున్నారు వైద్యులు. ప్రధానంగా సాధారణ ప్రజలు గుర్తించడానికి కూడా చాలా అవకాశం ఉందంటున్నారు. ఇందులో మంకీ పాక్స్ ముఖానికి, చేతులకు ముఖ్యం గా వ్యాపిస్తే… చికెన్ పాక్స్ శరీరం బాడీపైనే ప్రధానంగా బొబ్బలు, పొక్కులు కన్పిస్తాయి. మరోవైపు… ఈ బొబ్బల్లో తేడాతో పాటు..మంకీ పాక్స్ లో పెద్దగా బొబ్బలు ఉంటే.. చికెన్ పాక్స్ లో బొబ్బలు వివిధ దశల్లో కనిపిస్తాయంటున్నారు.

ఇవి కూడా చదవండి

మంకీ పాక్స్ లో తీవ్రమైన జ్వరం వచ్చి తగ్గిన తరువాత… వంటిపై బొబ్బలు, పొక్కులు ప్రారంభమవుతాయి. ఈ పొక్కులకు ఎలాంటి దురద వంటివి ఉండవు. అదే చికెన్ పాక్స్ లో అయితే.. జ్వరం లాంటివి లేకుండానే పొక్కులు రావడం, దురద వంటి లక్షణాలు కన్పిస్తాయి.  మంకీపాక్స్‌ మూకుమ్మడిగా సంక్రమించేది కాదు. కుందేళ్లు, ఎలుకలు, చింపాజీలు, గొరిల్లాల వంటి వాటి నుంచి సోకే ఇది ప్రస్తుతం మనుషుల్లోనూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం 15 శాతం. అదే మరణాలు కూడా ఈ స్ధాయిలో ఉంటాయి. అదే.. చికెన్ పాక్స్ సీజనల్ గా వ్యాపించే వ్యాధి. కొంత మాత్రమే అంటువ్యాధిలా కనిపిస్తోంది.మరణాలు అనేవి నూటికి 99శాతం ఉండవంటున్నారు.

మంకీ పాక్స్ కు వ్యాక్సిన్ లేదు… అప్పుడెప్పుడో వచ్చిన స్మాల్ పాక్స్ అంటే మసూచీ కి ఇచ్చే వ్యాక్సినే ఇస్తున్నారు. అదే చికెన్ పాక్స్ కు ప్రత్యేక మైన వ్యాక్సిన్ ఉంది. ఈ రెండూ చిన్న పిల్లలను వెంటాడుతుండటం కామన్ పాయింట్ గా కనిపిస్తోంది. మంకీ పాక్స్ వచ్చినట్లయితే… ప్రధానంగా మానవ శరీరంలో మెడ, చంకలు, తొడలు భాగంలో ఉండే లీఫ్‌ నోట్స్ గ్రంధులు వాపు కనిపిస్తుంది. ఈ లక్షణం మంకీ పాక్స్ గా గుర్తించడానికి కీలకం. అదే చికెన్ పాక్స్ అయితే.. ఈ గ్రంధులకు ఏ ఇబ్బంది ఉండదని తేల్చేస్తున్నారు వైద్యులు.

మంకీ పాక్స్ లక్షణాలు గుర్తిస్తే… ఖచ్చితంగా పూనే లాంటి ల్యాబ్స్ లోనే గుర్తింపు చేసే అవకాశం. అదే చికెన్ పాక్స్ అయితే.. వైద్యులు చూసిన వెంటనే గుర్తించే అవకాశం. అది ఎంత అంటే… ఏకంగా ఈ ఫోటోలు చూసి..లేదా టెలిపతి లాంటి వీడియో లను చూసి కూడా గుర్తించే అవకాశం ఉందంటున్నారు. కరోనా పాండమిక్ తో ఏ కొత్త వైరస్ ను చూసినా భయపడే పరిస్థితులు ఉన్నాయని, ఇప్పుడు మంకీ పాక్స్, చికెన్ పాక్స్ లక్షణాలు, తేడాలు తెలుసుకోవడం ద్వారా.. భయాందోళనకు దూరంగా ఉండే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే