Hyderabad: ముంచుకొస్తున్న గడువు.. పూర్తి కాని పనులు.. ఆందోళనలో ఖైరతాబాద్ గణేశుడి భక్తులు

తెలంగాణలో వినాయకచవితి (Vinayaka Chavithi) అంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడే. ఏ ఏటికేడు వేర్వేరు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ కనువిందు చేస్తుంటాడు. ఈ ఏడాది కూడా లంబోదరుడు 50 అడుగుల ఎత్తులో కొలువుదీరనున్నాడు....

Hyderabad: ముంచుకొస్తున్న గడువు.. పూర్తి కాని పనులు.. ఆందోళనలో ఖైరతాబాద్ గణేశుడి భక్తులు
Khairatabad Ganesh
Follow us

|

Updated on: Aug 09, 2022 | 6:20 PM

తెలంగాణలో వినాయకచవితి (Vinayaka Chavithi) అంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడే. ఏ ఏటికేడు వేర్వేరు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ కనువిందు చేస్తుంటాడు. ఈ ఏడాది కూడా లంబోదరుడు 50 అడుగుల ఎత్తులో కొలువుదీరనున్నాడు. ఏటా నెల ముందే అన్ని పనులు పూర్తి చేసుకునే ఖైరతాబాద్ (Khairatabad) గణేశ్ విగ్రహానికి ఈసారి వర్షాలు అడ్డంగా నిలిచాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పనులు మందకొడిగా సాగుతున్నాయి. వినాయచవితి ఘడియలు ముంచుకురావడం, పనులు నిదానంగా సాగుతుండటంతో సకాలంలో పూర్తవుతాయా లేదా అనే అనుమానం భక్తుల్లో ఏర్పడింది. అయితే త్వరలోనే పనులు పూర్తి చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. వర్షం లేకపోతే ఈలోపు పూర్తి స్థాయిలో పనులు అయిపోయేవని చెబుతున్నారు. అయితే ఖైరతాబాద్ బడా గణపతిని ఈసారి మట్టితో రూపొందిస్తున్నారు. పీఓపీ వాడకుండా కేవలం మట్టితో తయారు చేస్తున్నారు. కాగా.. పనులు త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది.

నిర్జల ఏకాదశిని పురస్కరించుకుని ఖైరతాబాద్ గణేశ్ మండపం దగ్గర, మహాగణనాథుడి విగ్రహ నిర్మాణ పనులను ఉత్సవ కమిటీ సభ్యులు కర్ర పూజతో ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతిని మట్టితో తయారు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ ఏడాది పంచముఖ లక్ష్మీగణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు గణపయ్య. అయితే, ఎక్కడ నిమజ్జనం చేయాలన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. హైకోర్టు తీర్పును బట్టి ఎక్కడ నిమజ్జనం అనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Khairatabad Ganesh 2022

Khairatabad Ganesh 2022

హైదరాబాద్ మహానగంరో కొలువుదీరే గణనాధుల విగ్రహాలన్నీ అధిక సంఖ్యలో హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనమవుతాయి. మరి ఈ ఏడాది హుస్సేన్‌ సాగర తీరంలో గణేష్‌ విగ్రహాల నిమజ్జనాలు ఉండవా? నీటి పొల్యూషన్ కి కారణమవుతోందని ప్రభుత్వం ఇప్పటి వరకూ నిమజ్జనాలకు హుస్సేన్‌ సాగర్‌ లో అనుమతి ఇవ్వలేదు. ఈ పరిస్థితుల మధ్య హైదరాబాద్‌ లో 30కి పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. సాగర్‌ లో విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వకపోవడం పై భాగ్యనగర్‌ ఉత్సన కమిటీతో పాటు వివిధ హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..