Telugu News Trending Dolphin jumping from water video was gone viral in social media Telugu news
Viral Video: లాంగ్ జంప్ లో పోటీ చేస్తే ఈ కింగ్ ఫిష్‌కే గోల్డ్ మెడల్.. అమాంతం నీళ్లల్లో నుంచి దూకి
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు (Video) పోస్ట్ అవుతుంటాయి. వీటిలో ఆశ్చర్యం కలిగించేవి కొన్నైతే.. ఫన్నీగా అనిపించేవి మరికొన్ని. అందులోనూ జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. చేపలకు సంబంధించిన...
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు (Video) పోస్ట్ అవుతుంటాయి. వీటిలో ఆశ్చర్యం కలిగించేవి కొన్నైతే.. ఫన్నీగా అనిపించేవి మరికొన్ని. అందులోనూ జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. చేపలకు సంబంధించిన వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. చేపలు సముద్రం నుంచి దూకే దృశ్యాలను నెటిజన్లు ఎక్కువగా చూస్తారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతుంది. కేవలం 24 సెకన్ల ఈ క్లిప్ ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే ఈ కింగ్ ఫిష్ నీటిలో నుంచి అమాంతం పైకి ఎగరడాన్ని చూడవచ్చు. అది చాలా ఎత్తుకు దూకినట్లు ఈ వీడియోలో మనకు అర్థమవుతుంది. వైరల్ అవుతున్న క్లిప్ లో ఒక చేప నీటి నుంచి పైకి దూకుతుంది. అది జంప్ చేసే దృశ్యం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ వీడియో చూసిన వారందరూ ఆ చేప ఎంత ఎత్తుకు దూకిందోనని ఊహించుకుంటున్నారు. ఈ అద్భుతమైన జంపింగ్ వీడియో ఓషన్‌వైరల్స్ అనే పేజీలో ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా పోస్ట్ అయింది.
ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. క్లిప్ చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చేప సముద్రం నుంచి 30 అడుగుల ఎత్తు వరకు దూకిందని కొందరు, మరికొందరు ఈ చేప 7 మీటర్లు దూకినట్లు కామెంట్లు చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ డాల్ఫిన్ జంప్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.