AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP-Jayasudha: తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం.. త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్న సినీ నటి జయసుధ!

తాజాగా ప్రముఖ సీనియర్ సినీ నటి, రాయకీయ నాయకురాలు జయసుధ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధంచేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకులు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర ప్రసాద్ తో జయసుధ భేటీ అయినట్లు తెలుస్తోంది.

BJP-Jayasudha: తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం.. త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్న సినీ నటి జయసుధ!
Jayasudha Bjp
Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 09, 2022 | 4:06 PM

Share

BJP-Jayasudha: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా తెలంగాణాలో మరింత బలపడే విధంగా వివిధ పార్టీల నేతల చేరికలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణాలో బీజేపీ ఆపరేషన్ ఆకర్షణ వేగవంతం చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన రాజగోపాల్ రెడ్డి త్వరలో బీజేపీ చేరనుండగా.. తాజాగా ప్రముఖ సీనియర్ సినీ నటి, రాయకీయ నాయకురాలు జయసుధ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధంచేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకులు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర ప్రసాద్ తో జయసుధ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 21 న బీజేపీలో చేరాలని జయసుధని ఈటెల కోరారు. ఈటెల రాంజేంద్ర తో జయసుధ సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నెల 21 అమిత్ షా తెలంగాణలోని మునుగోడులో పర్యటించనున్నారు. ఈ పర్యటన సమయంలో అమిత్ షా సమక్షంలో జయసుధ కాషాయ కండువా కప్పుకోనున్నారని సమాచారం.

2009 ఎన్నికలలో సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసి జయసుధ ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అకాల మరణం తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. అయితే సికింద్రాబాద్ లో జయసుధకు కొంత పట్టుంది.  2016లో TDPలో చేరారు జయసుధ.  టీడీపీకి గుడ్ బై చెప్పేసి.. 2019 ఎన్నికల సమయంలో హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో YS జగన్ నివాసంలో ఆయన సమక్షంలో జయసుధ వైసీపీలో చేరారు. అయితే గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న జయసుధ ఇప్పుడు బీజేపీ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి