AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP & TS Rains: ఏపీ, తెలంగాణల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం.. వ్యాపారం లేదంటూ స్ట్రీట్ వ్యాపారస్తుల ఆవేదన

రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ వాయువ్య  దిశగా కదులుతుంది. దీంతో వచ్చే రెండు మూడు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, విదర్భ, గుజరాత్, కొంకణ్ , గోవా, మధ్య మహారాష్ట్ర, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాలలో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

AP & TS Rains: ఏపీ, తెలంగాణల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం.. వ్యాపారం లేదంటూ స్ట్రీట్ వ్యాపారస్తుల ఆవేదన
Monsoon Rains
Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 09, 2022 | 4:02 PM

Share

AP & TS Rains: వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా తీరప్రాంతం, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ వాయువ్య  దిశగా కదులుతుంది. దీంతో వచ్చే రెండు మూడు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, విదర్భ, గుజరాత్, కొంకణ్ , గోవా, మధ్య మహారాష్ట్ర, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాలలో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు గత మూడు రోజులుగా ఎడారిపిలే కుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. తెలంగాణలోని హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి.

తెలంగాణ: రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గత మూడు రోజుల నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రహదారులు నదులను తలపిస్తున్నాయి. ప్రాజెక్టులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కేకే ఓసి లో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోజు వారీగా కెకె ఓసీలొ ఆరువేల టన్నుల ఉత్పత్తి తీయాల్సి ఉండగా నాలుగు రోజులుగా ఒక బొగ్గుపెళ్లా కూడా బయటికి రాలేదు. ఇప్పటివరకు ఇరవై నాలుగు వేల టన్నుల ఉత్పత్తిని నష్టపోయింది. ఓబి రూపేణా రెండులక్షల పది వేలు నష్టపోయింది. ఓసీలో వరదనీరు చేరడంతో వీటిని తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో మోటార్లను బిగించి పైపులైను ద్వారా వరద నీరును తొలగిస్తున్నారు. జూలై చివరి వారంలో కూడా వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో ఉత్పత్తి నష్టపోయింది. ఇప్పటివరకు కేకే ఓసి లో లక్షా ఇరవై వేల టన్నుల ఉత్పత్తి నష్టపోయినట్లు తెలుస్తోంది. ఉత్పత్తికి సంబంధించి అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కేకే ఓసి అంతా జలమయమైపోయింది. వర్షాలు తగ్గుముఖం పడితేనే బొగ్గు ఉత్పత్తి సాధ్యమని అధికారులు పేర్కొన్నారు

 ఆంధ్రప్రదేశ్:

ఇవి కూడా చదవండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది,, దీంతో నేడు ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నట్లు అధికారులు తెలిపారు. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరసగా కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో వీధి వర్తకులపై తీవ్ర ప్రభావం పడుతోందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధులు ఆహారం, పుస్తకాలు, బట్టలు , నగల స్టాల్స్‌తో సాధారణంగా రద్దీగా ఉంటుంది, అది వారపు రోజులు లేదా వారాంతాల్లో కావచ్చు. అయితే, వర్షం కారణంగా, గత కొన్ని రోజులుగా వీధిలో వ్యాపారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో స్ట్రీట్ వ్యాపారస్తులు వ్యాపారం లేక సంపాదన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..