Trs vs Bjp: త్వరలోనే టీఆర్‌ఎస్‌లో భూకంపం.. మరో బాంబ్ పేల్చిన బీజేపీ అగ్ర నేతలు..!
Trs vs Bjp: తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీజేపీ అగ్ర నేతలు చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.
Trs vs Bjp: తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీజేపీ అగ్ర నేతలు చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. టీఆర్‌ఎస్‌లో త్వరలో భూకంపం రాబోతోందని బాంబ్ పేల్చారు బీజేపీ మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ మురళీధర్‌రావు. బీజేపీపై కామెంట్ చేసే ముందు టీఆర్‌ఎస్ నేతలు ఒకసారి ఆలోచించుకోవాలని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందన్నారు. అటు నీతి అయోగ్ సమావేశానికి కేసీఆర్ గైర్హాజరు కావడాన్ని తప్పు పట్టారు మురళీధర్‌రావు. టీఆర్‌ఎస్‌లో షిండేలను బీజేపీ తయారు చేయడం లేదన్న మురళీధర్‌రావు.. ఆ పార్టీలోనే అసమ్మతి పెరిగిపోయిందన్నారు. ఆ అసమ్మతి ఎప్పుడు బయటపడి బ్లాస్ట్ అవుతుందోనని కేసీఆర్‌కు భయం పట్టుకుందంటున్నారు.
బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరూ నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరించలేదని, కేవలం కేసీఆర్ మాత్రమే బాయ్‌కాట్ చేశారని మండిపడ్డారు మురళీధర్‌రావు. కేంద్రం BSNL, LICని అమ్మేస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్, కేటీఆర్‌కు ఆర్థికశాస్త్రం తెలియదని ఎద్దేవా చేశారు మురళీధర్‌రావు. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నా, దేశం మాత్రం ఆర్థిక సంక్షోభం వైపుగా వెళ్లడం లేదని వివరణ ఇచ్చారు.
మరోవైపు తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అంటున్నారు బండి సంజయ్. ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రజాసంగ్రమ యాత్రలో భాగంగా చౌటుప్పల్‌లో ప్రసంగించారు బండి. ఒకవైపు మునుగోడు ఉప ఎన్నికలకు ప్రధాన పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటుండగా ఇటు టిఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల దాడి కొనసాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..