AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేవత్‌పల్లి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ప్రయాణికులతో అటుగా వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక వాహన దారుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.

Telangana: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
Anand T
|

Updated on: Mar 15, 2026 | 4:53 PM

Share

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతపల్లి మండలం దేవతపల్లి వద్ద హై స్పీడ్‌తో దూసుకొచ్చిన ఒక లారీ, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రాయణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు అకక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అయితే క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

అనంతరం ఆటోలో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రమాదానికి గురైన వాహనాలను క్రెయిన్ సహాయంలో పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. తర్వాత ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. అతి కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రత్యక్ష సాక్షులు మాత్రం దేవతపల్లి గేట్ వద్ద రోడ్డు వంపు తిరిగి ఉందని.. వేగంగా వచ్చే వాహనాలను అక్కడ అదుపు చేయడం కష్టమని చెబుతున్నారు. ఈ క్రమంలో అటుగా వేగంగా వచ్చిన లారీకి ఆటోను తప్పించే మార్గం లేకపోయిందని అందువల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతులు ఎవరాలు సేకరించే పనిలో ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us