Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఇంట్లో ఆనందం, శాంతి ఉండాలంటే ఇంటి పెద్దకు ఈ 4 లక్షణాలు తప్పనిసరి..

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితం సాఫీగా, సక్సెస్‌ఫుల్‌గా సాగడానికి పాటించాల్సిన కొన్ని నియమాలను పేర్కొన్నారు.

Chanakya Niti: ఇంట్లో ఆనందం, శాంతి ఉండాలంటే ఇంటి పెద్దకు ఈ 4 లక్షణాలు తప్పనిసరి..
Chanakya Rules
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 08, 2022 | 2:20 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితం సాఫీగా, సక్సెస్‌ఫుల్‌గా సాగడానికి పాటించాల్సిన కొన్ని నియమాలను పేర్కొన్నారు. వీటిని పాటించడం ద్వారా జీవితంలో ఎలాంటి సమస్యనైనా అధిగమించడమే కాకుండా.. సులువుగా విజయం సాధించవచ్చునని విశ్వాసం. ఆచార్య చాణక్య తన నీతిశాస్త్రంలో ఇంటి పెద్దకు ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా పేర్కొన్నారు. ఆ లక్షణాలు ఉంటే.. ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని, లేదంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. మరి కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. కుటుంబ పెద్దలు సరైన రుజువు లేకుండా దేనినీ నమ్మకూడదు. దేన్నైనా నమ్మే ముందు దాన్ని నిర్ధారించుకోవాలి. అలా చేయడంలో వైఫల్యం చెందితే.. కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 2. ఇంటి ఖర్చులను కుటుంబ పెద్ద చూసుకోవాలి. ఏదైనా ఖర్చు జాగ్రత్తగా చేయాలి. అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు రావడమే కాకుండా కుటుంబంలో వివాదాలు తలెత్తుతాయి. 3. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇంటి పెద్దలు కుటుంబంలోని ప్రతి సభ్యుని దృష్టిలో ఉంచుకోవాలి. ఎవరికీ నష్టం కలగకుండా నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయం పాటించకుంటే కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది. 4. కుటుంబ పెద్ద తన నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. ఇది కుటుంబ సభ్యుల మధ్య క్రమశిక్షణలో ఉండే అలవాటును కలిగిస్తుంది. కుటుంబ పెద్ద తన నిర్ణయాలలో దృఢంగా ఉండాలి. దీంతో కుటుంబంలో క్రమశిక్షణతో కూడిన వాతావరణం నెలకొంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..