Watch Video: ఒక్కసారిగా ముంచుకొచ్చిన వరదలు.. అందరూ చూస్తుండగానే కొట్టుకుపోయిన 14 కార్లు..

Viral Video: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

Watch Video: ఒక్కసారిగా ముంచుకొచ్చిన వరదలు.. అందరూ చూస్తుండగానే కొట్టుకుపోయిన 14 కార్లు..
Cars
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 08, 2022 | 1:42 PM

Viral Video: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదుల్లో నీటి ప్రవాహం అమాంతం పెరిగిపోయింది. ఖర్గోన్ జిల్లాలో సుక్ది నదికి వరద ప్రవాహం పెరిగింది. అప్పటి వరకు చుక్కలేకుండా ఉన్న నదికి.. క్షణాల్లోనే ఉధృతంగా వరద ప్రవాహం వచ్చింది. ఈ ప్రవాహంలో దాదాపు 14 కార్లు కొట్టుకుపోయాయి.

ఖర్గోన్ జిల్లాలో ఉన్న కొండగుట్టలు పర్యాటక ప్రాంతం. దాంతో ఇక్కడికి చాలా మంది పిక్నిక్‌గా వస్తుంటారు. తాజాగా కూడా సమీప ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చారు. కార్లలో వచ్చి.. అక్కడ సరదాగా సేదతీరారు. ఎండిపోయిన నదీ మార్గంలో కార్లను నిలిపి.. ప్రకృతిని ఆస్వాధిస్తున్నారు. ఇంతలో ఉన్నట్లుండి వరద ప్రవాహం దూసుకొచ్చింది. వెంటనే అలర్ట్ అయిన జనాలు.. కార్లను అక్కడే వదిలేసి.. కొండ గుట్టలపైకి ఎక్కారు. అయితే, వరద ప్రవాహానికి దాదాపు 14 కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఇది గమనించిన స్థానికులు ట్రాక్టర్ల సాయంతో 10 కార్లను బయటకు తీయగలిగారు. మిగతావి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అయితే, నీటి నుంచి బయటకు తీసిన కార్లు సైతం పూర్తిగా పాడైపోయాయి.

ఇవి కూడా చదవండి

చూస్తుండగానే కొట్టుకుపోయిన కార్లు..

అయితే, అప్పటి వరకు చుక్క నీరు లేని చోట.. ఒక్కసారిగా ప్రవాహం రావడం, కార్లు కొట్టుకుపోవడం క్షణాల్లో జరిగిపోయింది. అందరూ చూస్తుండగానే కార్లు నీటి మునిగిపోయాయి. వరద ప్రవాహ ఉధృతికి ఒక్కొక్క కారు నీటిలో తేలుతూ కొట్టుకుపోయాయి. అయితే, ఆ ప్రవాహాన్ని ముందే గుర్తించిన పర్యాటకులు.. బతుకు జీవుడా అంటూ ఎత్తైన ప్రాంతాలకు ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ నీటి ప్రవాహానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..