AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Azadi Ka Amrit Mahotsav: టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్‌.. ఆ చిన్నారులకు 12 ఏళ్లు వచ్చే దాకా ఉచిత ప్రయాణం.. ఇంకా

TSRTC: 75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ (TSRTC) వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. అజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా ఈ నెల పదో తేదీ నుంచి 21వ తేదీ వరకు 12 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు, ఆఫర్లు ప్రకటించింది.

Azadi Ka Amrit Mahotsav: టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్‌.. ఆ చిన్నారులకు 12 ఏళ్లు వచ్చే దాకా ఉచిత ప్రయాణం.. ఇంకా
Basha Shek
|

Updated on: Aug 09, 2022 | 8:11 AM

Share

TSRTC: 75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ (TSRTC) వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. అజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా  ఈ నెల పదో తేదీ నుంచి 21వ తేదీ వరకు 12 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు, ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12 ఏళ్లు పూర్తి అయ్యేంత వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. అదేవిధంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులు ఈ నెల 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. వీటితో పాటు టీ-24 బస్‌ టికెటును ఆ రోజున రూ.75( సాధారణ రోజుల్లో రూ.120)కే అందిస్తామని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు అన్ని బస్సులకు జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తామని, ఉద్యోగులంతా అమృతోత్సవ్‌ బ్యాడ్జీలతోనే విధులకు హాజరు కావాలని సూచించారు.

ఇండిపెండెన్స్‌డే ఆఫర్లివే..

ఇవి కూడా చదవండి
  •  టీటీడీ ప్యాకేజీని వినియోగించుకునే ప్రయాణికులకు ఈ నెల 16 నుంచి 21 వరకు రూ.75 తగ్గింపు.
  • ఆగస్టు 15న కార్గోలో ఒక కిలో పార్సిల్‌ 75 కిలో మీటర్ల వరకు ఉచిత రవాణా.
  • టాప్‌-75 ప్రయాణికులకు ఒక ట్రిప్‌ టికెట్‌ ఉచితం.
  • శంషాబాద్‌ విమానాశ్రయానికి ఆగస్టు 15న పుష్పక్‌ ఎయిర్‌ పోర్ట్‌ సర్వీసును వినియోగించుకునే ప్రయాణికులు 75 శాతం ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది
  • 75 సంవత్సరాలు దాటిన సీనియర్‌ సిటిజన్లకు తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో ఆగస్టు 15 నుంచి 22 వరకు ఉచిత వైద్య పరీక్షలు .
  • అలాగే 75 ఏళ్లలోపు వారికి రూ.750లతో వైద్య పరీక్షల ప్యాకేజీ అమలు చేస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం