Viral Video: వీడెవడండి బాబు ధైర్యానికే బ్రాండ్‌ అంబాసిడర్‌లా ఉన్నాడు.. భయంకరమైన మొసళ్లకు అలవోకగా..

Viral Video: సోషల్‌ మీడియా పుణ్యామాని నెట్టింట రోజుకో వీడియో వైరల్‌ అవుతోంది. ప్రపంచంలో ఏదో మూలన జరిగిన సంఘటన సైతం క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ఈ వీడియోల్లో జ్ఞానాన్ని పెంచేవి కొన్ని అయితే ఆశ్చర్యానికి గురి చేసేవి మరికొన్ని...

Viral Video: వీడెవడండి బాబు ధైర్యానికే బ్రాండ్‌ అంబాసిడర్‌లా ఉన్నాడు.. భయంకరమైన మొసళ్లకు అలవోకగా..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 09, 2022 | 3:52 PM

Viral Video: సోషల్‌ మీడియా పుణ్యామాని నెట్టింట రోజుకో వీడియో వైరల్‌ అవుతోంది. ప్రపంచంలో ఏదో మూలన జరిగిన సంఘటన సైతం క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ఈ వీడియోల్లో జ్ఞానాన్ని పెంచేవి కొన్ని అయితే ఆశ్చర్యానికి గురి చేసేవి మరికొన్ని. అయితే జ్ఞానాన్ని పెంచే వీడియోస్‌ కంటే ఆశ్చర్యానికి కలిగించే వీడియోలకే క్రేజ్‌ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఏమాత్రం విచిత్రంగా కనిపించినా సరే వీడియోను ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ఇలా అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లో తమ బంధువులకు, మిత్రులతో షేర్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకింత భయానికి కూడా గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి నది ఒడ్డుకు కవర్‌లో కొన్ని ఆహార పదార్థాలను తీసుకొచ్చాడు. అదే సమయంలో తీరానికి ఓ మూడు మొసళ్లు వచ్చాయి. వెంటనే కవర్‌లో నుంచి ఆహార పదార్థాలను బయటకు తీసి ఎంచక్కా వాటిలో నోట్లో వేశాడు.

వైరల్ వీడియో.. 

ఇవి కూడా చదవండి

దీనంతటికీ అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాను ఒక్కసారిగా షేక్‌ చేసింది. ఆ వ్యక్తి సాహసాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇక మరికొందరు మాత్రం ప్రాణాలకు తెగించి ఈ ఫీట్లు అవసరమా.? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..