Viral News: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ.. అలా చేస్తే నెలకు రూ.48000 ఇస్తారు.. 6 నెలలు మాత్రమే ఆఫర్
ఈ రోజుల్లో చాలా కంపెనీలలో, మెడికల్, టూర్, గిఫ్ట్ వోచర్‌లు, ఇతర రకాల పాలసీలు అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా కంపెనీలు తమ ఉద్యోగులకు కార్పొరేట్ సౌకర్యాలను అందించాలని ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగా..
Viral News: ప్రతి కంపెనీ తన ఉద్యోగులకు విధేయంగా ఉండే విధంగా కొన్ని సౌకర్యాలను అందిస్తుంది. ఈ రోజుల్లో చాలా కంపెనీలలో, మెడికల్, టూర్, గిఫ్ట్ వోచర్‌లు, ఇతర రకాల పాలసీలు అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా కంపెనీలు తమ ఉద్యోగులకు కార్పొరేట్ సౌకర్యాలను అందించాలని ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగా వారు తమ ఉద్యోగులకు కార్యాలయం నుండి బయట వరకు అదే కార్పొరేట్ వాతావరణాన్ని, సౌకర్యాలను కల్పిస్తున్నారు. తద్వారా వారు సంస్థ పట్ల అంకితభావంతో, విధేయతతో పని చేస్తున్నారు. దీంతో ఆయా కంపెనీలు కూడా 100 శాతం సిబ్బందిని నిలుపుకోగలుగుతుంది. ఇలాంటి టైమ్‌లో ఒక హోటల్ యాజమాన్యం తన సిబ్బందికి వెరైటీ వెసిలీటి ఇస్తోంది. దాంతో ఆ కంపెనీలో పనిచేసేందుకు అభ్యర్థులు ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఆ హోటల్ ఉద్యోగులకు ఇస్తున్న ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జర్మన్ హోటల్ గ్రూప్ రూబీ హోటల్స్ ద్వారా సిబ్బందికి వివిధ రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. హోటల్ తరపున, ప్రతి ఉద్యోగికి £ 500 అంటే భారతీయ కరెన్సీలో 48 వేల రూపాయల ఇస్తున్నారు.. ఈ డబ్బును కొత్త టాటూలు, కుట్లు, జుట్టు కత్తిరింపులకు ఖర్చు చేస్తాడు. హోటల్ వైస్ ప్రెసిడెంట్ తెలిపిన వివరాల ప్రకారం, వారు వారి వ్యక్తిత్వాన్ని బట్టి వ్యక్తులు ఉండటానికి అనుమతించాలని కోరుతున్నారు. హోటల్ ఈ కొత్త హైరింగ్ ట్రెండ్ సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.ఈ ఆఫర్ తర్వాత, 25 శాతం ఎక్కువ ఉద్యోగ దరఖాస్తులు వారి కార్యాలయానికి చేరుకుంటున్నాయి.
జర్మనీకి చెందిన హోటల్ గ్రూప్ రూబీ హోటల్స్‌లో రిక్రూట్‌మెంట్ కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. ఈ హోటల్‌లో పనిచేసేందుకు అభ్యర్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. హోటల్ యాజమాన్యం.. సిబ్బందికి అందిస్తున్న విభిన్న సౌకర్యాలే అభ్యర్థులు బారులు తీరేందుకు ముఖ్య కారణం. అదేంటంటే.. హోటల్ తన ప్రతి ఉద్యోగికి సుమారు 48,000 రూపాయలు వేతనంగా చెల్లిస్తుంది. అయితే, ఈ డబ్బు జీతం కోసం కాదు.. జీతం కాదా..? అయితే మరెందుకు అనే సందేహం వేయకమానదు..అయితే,అది జీతం కాదు.. కొత్త పచ్చబొట్లు, కుట్లు, జుట్టు కత్తిరించుకోవడం కోసం ఇవ్వబడుతుంది. హోటల్ అందించే ఈ సౌకర్యాల గురించి తెలుసుకుని, ఇప్పుడు ఇతర వ్యక్తులు కూడా ఉద్యోగాలు అడగడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడకు చేరుకుంటున్నారు.
ఈ సదుపాయం కేవలం 6 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వారి స్వయంకృతాపరాధం కోసం హోటల్ ద్వారా డబ్బులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. కొత్తగా కంపెనీలో చేరే ఉద్యోగులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. సోషల్ మీడియాలో హోటల్ గ్రూప్ తీసుకుంటున్న ఈ చొరవను ప్రజలు అభినందిస్తున్నారు. వాస్తవానికి, చాలా కంపెనీలు ఉద్యోగులపై టాటూ వేయడం లేదా కుట్లు వేయడం వంటివి నిషేధించబడ్డాయి. అయితే ప్రజల ఎంపికను గౌరవిస్తున్నందుకు రూబీ హోటల్‌లను ప్రజలు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి