Students Suicides: గుంటూరులో మరో దారుణం.. అవమానభారంతో ఉరివేసుకుని విద్యార్థి బలవన్మరణం!
ఇటీవల, కొరిటెపాడులోని కిలారు టవర్స్ పైనుంచి కిందకు దూకి యునీలా అనే ఇంజనీరింగ్ విద్యార్థిని బలవన్మరణం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటం..
గుంటూరు నగరంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఘటన మరువక ముందే.. మరో స్కూల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది. ఇదిలా ఉండగానే, గుంటూరు నగరంలోని మున్సిపల్ స్కూల్ లో 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య మరింత కలకలంగా మారింది. టీచర్ వేదింపుల కారణంగా 9 వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. గుంటూరులోని నల్లకుంట SKBBM స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న ఆకాశ్‌గా పోలీసులు గుర్తించారు.
అయితే, సరిగా చదవడం లేదని విద్యార్థి పై టీచర్స్ సూటిపోటీ మాటలు అన్నారని, టీసి తీసుకోని స్కూల్ నుంచి వెళ్లిపోవాలని మండిపడినట్టుగా తోటి విద్యార్థులు పోలీసులకు వివరించారు. అవమానభారంతో ఆకాశ్ ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. ఆకాశ్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సదరు స్కూల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల, కొరిటెపాడులోని కిలారు టవర్స్ పైనుంచి కిందకు దూకి యునీలా అనే ఇంజనీరింగ్ విద్యార్థిని బలవన్మరణం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం సర్టిఫికెట్లను తన స్నేహితురాలి వద్ద ఉంచగా.. తన వద్ద లేవని ఆమె బుకాయించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు యువతి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్టు తెలిసింది. తాను ఉంటున్న ప్రైవేటు హాస్టల్ భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకోగా.. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్నారు.