Vishakhapatnam: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం.. రైల్వే మంత్రి హామీ

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజల చిరకాల వాంఛ తీరనుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెరపైకి వచ్చిన విశాఖ (Visakhapatnam) కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. భవన...

Vishakhapatnam: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం.. రైల్వే మంత్రి హామీ
Vizag Railway Station
Follow us

|

Updated on: Aug 08, 2022 | 7:25 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజల చిరకాల వాంఛ తీరనుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెరపైకి వచ్చిన విశాఖ (Visakhapatnam) కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. భవన నిర్మాణానికి స్థల సేకరణ కూడా పూర్తయ్యిందని తెలిపారు. జోన్‌ ఏర్పాటుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రాజ్యసభలో సోమవారం కేంద్రీయ విశ్వ విద్యాలయాల చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా వైసీపీ సభ్యులు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఆడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను ఆమోదించినట్లు పేర్కొన్నారు. అంతకు ముందు బిల్లుపై విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. రైల్వేకు సంబంధించి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై పలు సూచనలు, సలహాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా విశాఖ కేంద్రంగా ప్రకటించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. రైల్వే మంత్రిత్వశాఖ వద్ద మూడు సంవత్సరాలుగా డీపీఆర్‌ పెండింగ్‌లోనే ఉందని వివరించారు. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ. 68 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు ఉన్నాయి. ప్రతి రోజు 21వేల ట్రైన్లు నడుస్తున్నాయి. దేశంలో 7,350 రైల్వే స్టేషన్ల నుంచి ప్రతిరోజు 2.2 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు.

విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి మంత్రిని కోరారు. దేశంలో మొత్తం 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదని చెప్పారు. దీంతో ఉద్యోగార్ధులు రైల్వే పరీక్షల కోసం పక్క రాష్ట్రంలోని సికింద్రాబాద్ కు వెళ్లాల్సి వస్తుందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంటుకు తగినన్ని వ్యాగన్లు కేటాయించాలని కోరారు. వైజాగ్ స్టీల్ ప్లాంటుకు డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాగన్లు అందుబాటులో లేకపోవడంతో బొగ్గు సరఫరాలో కృత్రిమ కొరత ఏర్పడుతోందని.. తద్వారా ఉత్పత్తి కుంటుపడుతోందని వివరించారు. ఫలితంగా స్టీల్ ప్లాంటులో ఒక బ్లాస్ట్‌ ఫర్నేస్‌ మూసివేయాల్సి వచ్చిందని.. దీనివలన ఉక్కు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని వివరించారు. లాభాల బాటలో ఉన్న సంస్థలను ప్రైవేటు పరం చేయకూడదన్నది బీజేపీ ప్రభుత్వం విధానం. అయినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయాలనుకోవడం శోచనీయం.

రైల్వేలో 2.97 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని వెంటనే భర్తీ చేయాలి. 2020-21లో 9,529 ఖాళీలు భర్తీ చేయగా 2021-22లో 10,637 ఖాళీలు మాత్రమే భర్తీ చేశారు. ఈ లెక్కన మొత్తం ఖాళీలు భర్తీ చేయడానికి 30 ఏళ్లు పడుతుంది. 2019లో రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తు రుసుం రూపంలో రైల్వే శాఖకు రూ.864 కోట్ల ఆదాయం చేకూరింది. 2019లో నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ నేటి వరకు ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారు. యూపీఎస్సీ మాదిరిగా రైల్వేలో కూడా ఉద్యోగాల భర్తీ నిర్ణీత కాలంలో ప్రతి సంవత్సరం జరగాలి.

ఇవి కూడా చదవండి

   – విజయసాయి రెడ్డి, వైసీపీ ఎంపీ

రవాణా, లాజిస్టిక్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని విజయసాయి రెడ్డి సూచించారు. లాజిస్టిక్ రంగంలో 20% మంది మాత్రమే మహిళా ఉద్యోగులు ఉన్నారన్న ఆయన.. కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారిలో మహిళలు కేవలం 1 శాతం మాత్రమే ఉన్నారని చెప్పారు. రవాణా, లాజిస్టిక్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. సెంట్రల్ యూనివర్శిటీల్లో ఏర్పడ్డ ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. దేశంలో కేంద్ర విద్యాశాఖ పరిధిలో ఉన్న 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి