AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఐదు నిమిషాల ముందే టికెట్ బుకింగ్.. అంతే కాకుండా

రైలు టిక్కెట్లు (Train Tickets) కన్ఫార్మ్ చేసుకోవడం అంత సులభమేమీ కాదు. మనం ప్రయాణం చేయాలనుకుంటున్న రోజుకు రెండు, మూడు నెలల ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ అవి కన్ఫార్మ్ అవుతాయని చెప్పలేం. దూర...

IRCTC: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఐదు నిమిషాల ముందే టికెట్ బుకింగ్.. అంతే కాకుండా
Trains
Ganesh Mudavath
|

Updated on: Aug 08, 2022 | 4:59 PM

Share

రైలు టిక్కెట్లు (Train Tickets) కన్ఫార్మ్ చేసుకోవడం అంత సులభమేమీ కాదు. మనం ప్రయాణం చేయాలనుకుంటున్న రోజుకు రెండు, మూడు నెలల ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ అవి కన్ఫార్మ్ అవుతాయని చెప్పలేం. దూర ప్రయాణాలు చేసే సమయంలో ఈ ఇబ్బంది చాలా అధికంగా ఉంటుంది. రద్దీ రూట్లలో అయితే ఈ సమస్య గురించి చెప్పనక్కర్లేదు. తరచూ రైలు ప్రయాణాలు చేసే వారందరికీ ఆ సమస్యలేమిటో తెలిసిందే. ఒకటి రెండు రోజుల ముందు ప్రయాణాలు నిర్ణయమైతే తత్కాల్ బుకింగ్ (Tatkal Booking) మాత్రమే దిక్కు. అందులోనూ టికెట్‌ దొరక్కపోతే వేరే ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందే. అందుకే ట్రైన్ టికెట్ పొందడం అంత సులభమైంది కాదు. వీరి ఇబ్బందులను గమనించిన రైల్వే అధికారులు.. ప్రయాణీకుల కోసం సరికొత్త ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ద్వారా క్షణాల్లో టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. సాధారణంగా బుకింగ్ కౌంటర్లలో ట్రైన్ బయల్దేరడానికి నాలుగు గంటల ముందే చార్ట్ ప్రిపేర్ అవుతుంది. కాబట్టి నిర్ణీత సమయం దాటిన తర్వాత మనం టికెట్లు పొందలేం.

కాగా.. ఈ ప్రత్యేక ఆప్షన్ ద్వారా ట్రైన్ లో టికెట్లు ఖాళీగా ఉంటే ఆ రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్‌ వద్ద గానీ, ఆన్‌లైన్‌లోగానీ తీసుకోవచ్చు. మామూలుగా అయితే.. రిజర్వేషన్ చేసుకున్న టికెట్ల వివరాలు తెలుపుతూ రైల్వే శాఖ రెండు రకాల చార్టులను సిద్ధం చేస్తుంది. ఫస్ట్‌ ఛార్ట్‌ రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు ప్రిపేర్‌ అవుతే.. రెండో ఛార్ట్‌ అనేది ప్రయాణానికి సరిగ్గా అరగంట ముందు ప్రిపేర్ అవుతుంది. కాబట్టి రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందు వరకు కూడా టికెట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

ట్రైన్ లో టికెట్లు ఖాళీగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. https://www.irctc.co.in/online-charts/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రైలు నంబర్‌, తేదీ, ఎక్కాల్సిన స్టేషన్‌ వివరాలు ఇస్తే ఒక్కో బోగీలో ఎన్ని బెర్తులు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోచ్చు. తద్వారా సులభంగా బుకింగ్‌ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఆన్‌లైన్‌ ఛార్ట్‌ వల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉంది. ప్రయాణికులు ఏ స్టేషన్ లో రైలు ఎక్కుతారు.. ఏ స్టేషన్ లో రైలు దిగుతారు అనే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..