AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనదారులు బీ అలర్ట్‌..! కేవలం హెల్మెట్‌ పెడితే సరిపోదు.. ఈ నిబంధనలు తప్పనిసరి! లేదంటే జేబుకు చిల్లే..

రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాఫిక్ నియమాలను మరింత కఠినతరం చేస్తున్నాయి. మోటార్ వాహన చట్టాన్ని కూడా మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే ఇందులో టూవీలర్‌ నడిపించే వారు రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. లేదంటే భారీ జరిమానాలు విధించడంతో పాటు.. కఠినమైన చర్యలు కూడా తప్పవని గతంలో నుండే అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే, కేవలం హెల్మెట్ ధరించడం సరిపోదు. హెల్మెట్‌లకు సంబంధించిన […]

వాహనదారులు బీ అలర్ట్‌..! కేవలం హెల్మెట్‌ పెడితే సరిపోదు.. ఈ నిబంధనలు తప్పనిసరి! లేదంటే జేబుకు చిల్లే..
Helmet
Jyothi Gadda
|

Updated on: Aug 08, 2022 | 5:09 PM

Share

రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాఫిక్ నియమాలను మరింత కఠినతరం చేస్తున్నాయి. మోటార్ వాహన చట్టాన్ని కూడా మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే ఇందులో టూవీలర్‌ నడిపించే వారు రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. లేదంటే భారీ జరిమానాలు విధించడంతో పాటు.. కఠినమైన చర్యలు కూడా తప్పవని గతంలో నుండే అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే, కేవలం హెల్మెట్ ధరించడం సరిపోదు. హెల్మెట్‌లకు సంబంధించిన కొన్ని నియమాలు కూడా వర్తిస్తాయి. వీటిని పాటించకపోతే కూడా జరిమానా తప్పదు. అదేంటంటే.. మీ హెల్మెట్ ఎలా ఉండాలి..? హెల్మెట్‌ తయారీ విధానం..? ఇలా కొన్ని నిబంధనలను ప్రభుత్వం పెట్టింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టూవీలర్‌ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని రక్షించడమే కాకుండా, చాలా సందర్భాలలో ట్రాఫిక్ చలాన్‌లను నివారిస్తుంది. సాధారణంగా హెల్మెట్ ధరించిన వ్యక్తిని కూడా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకోవడం చాలా అరుదు. అయితే కేవలం హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు. హెల్మెట్‌లకు సంబంధించిన కొన్ని నియమాలు కూడా వర్తిస్తాయి. కాబట్టి ఏ రకమైన హెల్మెట్‌పై చలాన్ ఉంటుంది. ఎలాంటి హెల్మెట్‌ ధరిస్తే చలాన్‌ పడుతుంది అన్న వివరాల్లోకి వెళితే…

ఈ విధంగా హెల్మెట్ ధరించండి 1. నిబంధనల ప్రకారం..హెల్మెట్ బలమైన మెటీరియల్‌తో తయారు చేసి ఉండాలి. ప్రమాదం జరిగినప్పుడు అది ఆ వ్యక్తి తలను రక్షించేగలిగేలా సరైనా ఆకృతిలో ఉండాలి. 2. డ్రైవర్ తలపై హెల్మెట్ తప్పని సరిగా ధరించాలి. దాని పట్టీ కూడా కట్టాలి. అంటే కేవలం తలకు హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు. నిబంధనల ప్రకారం మీ హెల్మెట్.. 1. హెల్మెట్ బరువు 1.2 కిలోల వరకు ఉండాలి. 2. హెల్మెట్‌లో అధిక నాణ్యత, దాని కనీస మందం 20-25 మిమీ ఉండాలి. 3. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం, అన్ని హెల్మెట్‌లకు ISI గుర్తు ఉండటం తప్పనిసరి. ఐఎస్‌ఐ గుర్తు లేకుండా హెల్మెట్‌లు ధరించడం, అమ్మడం చట్టరీత్యా నేరం. 4. హెల్మెట్‌లో కళ్లకు పారదర్శకమైన కవర్‌ను ఉపయోగించాలి. 5. హెల్మెట్ BIS సర్టిఫికేట్ పొందడం కూడా చాలా ముఖ్యం. 6. మీరు చట్టవిరుద్ధమైన హెల్మెట్‌ను ఉపయోగించి పట్టుబడితే, ఏవైనా సూచనలను పాటించడంలో నిర్లక్ష్యం వహించినట్టైతే.. మీ హెల్మెట్ జప్తు చేయబడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి