మరణానికి ముందు మహిళ సెల్ఫీ వీడియో.. భర్త క్రూరత్వాన్ని భరించలేక ఆత్మహత్య.. భగ్గుమన్న నెటిజనం

కొడుకు పుట్టలేదనే కారణంగా అతడు తనపై వేధింపులకు పాల్పడుతున్నట్టుగా వివరించింది. పెళ్లయిన రెండో సంవ‌త్స‌రం నుంచే తనకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

మరణానికి ముందు మహిళ సెల్ఫీ వీడియో.. భర్త క్రూరత్వాన్ని భరించలేక ఆత్మహత్య.. భగ్గుమన్న నెటిజనం
Suicide
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 08, 2022 | 4:18 PM

భర్త వేధింపులతో విసిగిపోయిన ఓ ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఆ మహిళ తన భర్తపై ఉన్న ద్వేషాన్ని వీడియో తీసి వివరించింది. ఆడపిల్లలు పుట్టడమే కారణంగా తన భర్త తనను రోజూ కొట్టేవాడని బాధితురాలు ఆరోపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రజలు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో, 30 ఏళ్ల ఓ మహిళ తన మనోవేదనను వెల్లగక్కింది. ఏదో ఒక రోజు అతను తన తీరును మార్చుకుంటాడనే ఆశతో నేను ఇవన్నీ సహించాను. ఆరు, నాలుగేళ్ల ఇద్దరు కూతుళ్లతో పదే పదే ఏడుస్తూ.. ఎనిమిదేళ్లు గడిచిపోయింది. ఇక ఇప్పుడు రోజు అతడు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేకపోతున్నాను. పంజాబీలో మాట్లాడుతూ,.. తన భర్త, అత్తమామలు తనను బలవంతంగా ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపించింది. దాంతో ఆమె ‘నాన్న నేను చనిపోబోతున్నాను.. దయచేసి నన్ను క్షమించండి’ అంటూ మన్‌దీప్‌ కౌర్‌ తన తల్లిదండ్రులకు సందేశం పంపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూర్‌కు చెందిన మన్‌దీప్ కౌర్ అనే పంజాబీ మహిళకు, అమెరికాలో ఉంటున్న భార‌త సంప‌తికి చెందిన‌ రంజోధ్‌బీర్ సింగ్ తో 2015లో వివాహం జరిగింది. ఇద్దరూ కుటుంబంతో క‌లిసి అమెరికాలోని న్యూయార్క్‌లోనే నివ‌సిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. అయితే.. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో ఆమె భర్త, అతడి కుటుంబం ఆమెను మాన‌సికంగా, శారీర‌కంగా తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో వేధింపులు భరించలేక అక్కడే మన్‌దీప్ కౌర్ ఆత్మహత్యకు పాల్పడింది. మన్‌దీప్ కౌర్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడే ముందు తన బాధను చెప్పుకుంటూ, ఏడుస్తూ.. ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. ఇందులో గత 8 ఏళ్లుగా తన భర్త వేధింపులను ఎలా ఎదుర్కొంటుందో కౌర్ స్వయంగా చెప్పింది. ఆ వీడియోలో తన శరీరంపై గుర్తులు, రక్తం గడ్డకట్టడం, చాలా చోట్ల గాయాలను చూపించింది. వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా వివరించింది.

ఇవి కూడా చదవండి

కొడుకు పుట్టలేదనే కారణంగా అతడు తనపై వేధింపులకు పాల్పడుతున్నట్టుగా వివరించింది. పెళ్లయిన రెండో సంవ‌త్స‌రం నుంచే తనకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. భర్త వేధింపులు వీడియోల ద్వారా ప్రపంచానికి చూపించింది. ఆ వీడియోల్లో తల్లిని కొట్ట‌వ‌ద్దంటూ పిల్లలు తండ్రిని వేడుకుంటున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. అవన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ కావటంతో మన్‌దీప్ కౌర్‌కు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియాలో ప్ర‌వాస‌ భారతీయులు స్పందించారు. ముఖ్యంగా అమెరికాలోని పంజాబీల హక్కుల కోసం పోరాడే ‘ద కౌర్ మూమెంట్’ సంస్థ దీనిపై విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు బాధ్యులైన నిందితుల‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వీడియోలను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్‌ చేస్తూ తమ డిమాండ్లను మరింత గట్టిగా వినిపించారు. దాంతో న్యూయార్క్ పోలీసులు ఈ ఘ‌ట‌న‌ను ఆత్మహత్యగా కాకుండా హత్యగా పరిగణించి కేసు నమోదు చేశారు. లోతైన విచారణ కొనసాగిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి