AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కొడుక్కి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనితెచ్చిన తండ్రి.. అప్పుడు ఆ బుడ్డొడి రియాక్షన్‌ చూడాలి..! షాక్‌ అవుతారు..

ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లతో పాటు మీ హృదయాన్ని కూడా గెలుచుకుంటుంది. ఈ వీడియోను ఐఎఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేశారు.

Viral News: కొడుక్కి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనితెచ్చిన తండ్రి.. అప్పుడు ఆ బుడ్డొడి రియాక్షన్‌ చూడాలి..! షాక్‌ అవుతారు..
Untitled 1
Jyothi Gadda
|

Updated on: Aug 08, 2022 | 2:53 PM

Share

Viral Video: సెకండ్ హ్యాండ్ కార్లు కొనుక్కోవడం కూడా చిన్న విషయమే అనుకుంటున్న నేటి కాలంలో.. చాలా మంది పేదలకు పాత వస్తువులు కొనడం కూడా పెద్ద విషయమే. ఇంట్లోకి కొత్త వస్తువులు వస్తే ఆనందం ఎప్పుడూ ఉంటుంది.. కానీ, పాత వస్తువులు కొని సంబరాలు చేసుకోవడం ఎప్పుడైనా చూసారా? కానీ, ఓ చిన్నారి సెకండ్‌ హ్యాండ్‌ వస్తువు ఇంటికి రావటం సంతోషంతో ఎగిరి గంతులెశాడు..ఆ బుడ్డొడి సంతోషానికి సంబంధించిన ఈ వీడియోను మీరు తప్పక చూడండి..ఓ నిరుపేద కుటుంబానికి చెందిన బాలుడి తండ్రి అతనికి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొని తెచ్చాడు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లతో పాటు మీ హృదయాన్ని కూడా గెలుచుకుంటుంది. ఈ వీడియోను ఐఎఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేశారు. ఇది నేటికీ చాలా మంది చూస్తున్నారు. వీడియో ఒక తండ్రి, కొడుకు మధ్య జరిగిన అపూర్వ సన్నివేశం..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి మీరు కూడా ఎమోషనల్ అవుతారు. ఒక తండ్రి తన కొడుకు కోసం సెకండ్ హ్యాండ్ సైకిల్ కొని ఇంటికి తీసుకురావడం చూడవచ్చు. ఇది చూసిన కొడుకు తండ్రి ఖరీదైన కారు కొని తెచ్చినట్టుగానే సంతోషించాడు. పైగా ఆ సైకిల్‌కి పూలదండ వేసి పూజ చేసి, స్వాగతం పలుకుతాడు. వీడియోలో అతడు సైకిల్‌కి పూజ చేయటం కూడా చూడొచ్చు. సైకిల్‌ను చూస్తే చాలా పాతదిగా కనిపిస్తోంది. అదే సమయంలో ఇద్దరూ చేతులు జోడించి నిలబడి సైకిల్‌ ఎదుట దండం పెట్టుకుంటారు. తండ్రీకొడుకుల ముఖాల్లోని సంతోషం ఆకాశన్నంటుతోంది.

ఇవి కూడా చదవండి

ఇద్దరి సంతోషం చూస్తుంటే సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కోలేదు.. ఓ ఖరీదైన కారు కొనుగోలు చేసినట్టుగానే ఉన్నారు అనిపిస్తుంది. ఈ వీడియోను కొన్ని రోజుల క్రితం ఐఏఎస్ అధికారి అవ్నీష్ శరణ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వీడియోతో పాటు క్యాప్షన్‌లో ఇలా రాశారు..’ఇది కేవలం సెకండ్ హ్యాండ్ సైకిల్ మాత్రమే..కానీ, వారి ముఖాల్లో ఆనందం చూడండి. కొత్త మెర్సిడెస్ బెంజ్ కొన్నట్లు అతని ఎక్స్‌ప్రెషన్‌ చెబుతోంది. అన్నారు. అయితే, ఈ వీడియో పాతదే. కానీ, వీడియోకి ఒక మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్‌, లైకులతో మరోమారు నెటింట్ట హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్
ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్
వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..
వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..
బీసీసీఐ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్ ఫైర్
బీసీసీఐ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్ ఫైర్
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన
క్యాండీ క్రష్‌తో వరల్డ్‌ రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ కుర్రాడు
క్యాండీ క్రష్‌తో వరల్డ్‌ రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ కుర్రాడు
నాకు మా నాన్న కావాలి.. ఎగ్జామ్‌లో చిన్నారి ఆన్సర్..
నాకు మా నాన్న కావాలి.. ఎగ్జామ్‌లో చిన్నారి ఆన్సర్..
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇదే బెస్ట్
.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇదే బెస్ట్