Viral Video: బాబోయ్ వీళ్లు అమ్మాయిలేనా..? క్లాస్‌ రూమ్‌లోనే కుమ్మేసుకుంటున్నారు.. జుట్టుపట్టి మరీ ఒకరినొకరు..

అయితే పాఠశాలలోనే విద్యార్థులు ఒకరినొకరు దారుణంగా కొట్టుకోవడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Viral Video: బాబోయ్ వీళ్లు అమ్మాయిలేనా..? క్లాస్‌ రూమ్‌లోనే కుమ్మేసుకుంటున్నారు.. జుట్టుపట్టి మరీ ఒకరినొకరు..
Girals
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 07, 2022 | 12:23 PM

స్కూల్ అనే పదం వినగానే మనసులో ఓ అభిమానం ఏర్పడుతుంది. అక్కడ పిల్లలకు జ్ఞానం నేర్పుతారు. తప్పు ఒప్పులకు మధ్య వ్యత్యాసం వివరించబడింది. ఒకరినొకరు గౌరవించుకోవడం నేర్పుతారు. అయితే పాఠశాలలోనే విద్యార్థులు ఒకరినొకరు దారుణంగా కొట్టుకోవడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్దరు బాలికలు ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగుతున్న వీడియో పాఠశాలలోని ఒక తరగతికి సంబంధించినదిగా కనిపిస్తోంది. ఇందులో ఇద్దరూ ఒకరిపై ఒకరు దారుణంగా అరుచుకుంటూ, దాడి చేసుకుంటున్నారు.

బయటపడ్డ వీడియోలోని కొన్ని సెకన్లలో వారిద్దరూ ఒకరినొకరు వాదించుకుంటూ ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. నిజానికి ఏదో చర్చించుకుంటున్న క్రమంలోనే అమ్మాయిల మధ్య మాట మాట పెరిగింది. మధ్యలో అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇందులో ఇద్దరూ ఒకరినొకరు చెప్పుతో కొట్టుకుంటున్నారు. జుట్టుపట్టి లాగి మరీ ఒకరినొకరు కొట్టుకోవడం వీడియోలో కనిపించింది.. క్లాసుకి టీచర్ వచ్చినా ఇద్దరూ కొట్టుకుంటూనే ఉన్నారు. వారిద్దరి మధ్య ఘోరంగా గొడవపడటం చూసి టీచర్ కూడా చలించిపోయాడు.  ఇక ఇదంతా చూస్తున్న తోటి విద్యార్థులు తెగ ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటున్న దృశ్యం కూడా మనం వీడియోలో చూడొచ్చు..వీడియో చివరి దాకా చూస్తే మీరు ఖచ్చితంగా షాక్‌ అవుతారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో bhutni_ke_memes అనే పేజీలో కూడా అప్‌లోడ్ చేయబడింది. దీనిపై నెటిజన్లు కూడా ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.