Telangana: రఘునాథపల్లి వాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్‌.. స్థానికుల సహాయంతో బయటపడ్డ డ్రైవర్‌

మరో మూడు రోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో..

Telangana: రఘునాథపల్లి వాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్‌.. స్థానికుల సహాయంతో బయటపడ్డ డ్రైవర్‌
Tractor Washed
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 07, 2022 | 11:28 AM

రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ కుండపోతగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతోనే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా వరంగల్, హన్మకొండ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్, జనగామ జిల్లాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రఘునాథపల్లి మండలం కోడూరు కల్వర్టు వద్ద వాగు ఉప్పొంగడంతో ట్రాక్టర్‌ కొట్టుకుపోయింది. అదృష్టం బాగుండి ట్రాక్టర్‌ డ్రైవర్‌ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

జనగామ జిల్లా రఘునాథపల్లిలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. చెరువులన్నీ మత్తడి పోస్తున్నాయి. ఈ క్రమంలోనే రఘునాథపల్లిలో నర్సింహులు అనే పొలం పనులు ముగించుకుని వస్తుండగా పెను ప్రమాదం తప్పింది. వరద ప్రవాహంతో ట్రాక్టర్‌ వాగులో కొట్టుకుపోయింది. కల్వర్టు కింద స్తంభానికి చిక్కుకుని ట్రాక్టర్ ఆగిపోయింది. దాంతో స్థానికులు గమనించి అతన్ని కాపాడి ఒడ్డుకు చేర్చారు. స్థానికుల సహాయంతో డ్రైవర్‌ నర్సింహులు సురక్షింగా బయటపడ్డాడు. వాగులో చిక్కుకున్న ట్రాక్టర్ ను జేసిబి తో సహాయంతో బయటకు తీశారు గ్రామస్తులు.

ఇదిలా ఉంటే, మరో మూడు రోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?