Funny video: అయ్యో పాపం అమ్మమ్మ.. ఎరక్కపోయి ఆడింది.. పసిపిల్లలా జారింది.. వీడియో చూశారంటే పొట్ట చెక్కలే..

ఇక్కడ కొన్నిసార్లు పెళ్లికి సంబంధించిన కంటెంట్ వైరల్ అవుతుంది. మరి కొన్నిసార్లు చిలిపి వీడియోలు ప్రజలను తెగ నవ్విస్తాయి. సోషల్ మీడియా వచ్చిన నుంచి చాలా మంది వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా

Funny video: అయ్యో పాపం అమ్మమ్మ.. ఎరక్కపోయి ఆడింది.. పసిపిల్లలా జారింది.. వీడియో చూశారంటే పొట్ట చెక్కలే..
Funny Video
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 07, 2022 | 9:04 AM

Funny video: కళ్ల ముందు జరిగేవి మాటల్లో చెప్పడం చాలా కష్టంగా ఉన్న నేటి కాలంలో సోషల్ మీడియా వేదికగా మారింది. ఇక్కడ కొన్నిసార్లు పెళ్లికి సంబంధించిన కంటెంట్ వైరల్ అవుతుంది. మరి కొన్నిసార్లు చిలిపి వీడియోలు ప్రజలను తెగ నవ్విస్తాయి. సోషల్ మీడియా వచ్చిన నుంచి చాలా మంది వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా హాస్యాన్ని పంచే వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడమే కాదు అలా చేసిన మంచి ఆదాయం కూడా ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్, ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు.అయితే, ఇప్పుడు బయటకు వచ్చిన వీడియో వీటన్నింటికీ భిన్నంగా ఉంది. ఈ వీడియో ప్రమాదవశాత్తు పిల్లలతో స్లైడింగ్ స్వింగ్‌పైకి వెళ్లిన ఓ బామ్మకు సంబంధించినది. వీడియో చూసి మీ ఫీలింగ్స్‌ ఎంటో చెప్పండి మరీ..

ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో పిల్లలు స్లైడింగ్ స్వింగ్‌పై కూర్చొని ఒక్కొక్కరుగా కిందకు జారడం చూడవచ్చు. అంతలో బామ్మ కూడా పిల్లలతో పాటు స్లైండింగ్‌ పైకి ఎక్కింది.పిల్లలు హ్యాపీగా కిందకు జారుతున్నారు. వారితో పాటే ఆ బామ్మకూడా జారాలని ప్రయత్నించింది. కానీ, పాపం ఆమె కింద వరకు బాగానే జారింది..కానీ, ఆ తర్వాతే బొక్కబోర్లా పడిపోయింది. కాసేపు పైకి లేవనటానికి కూడా ఇబ్బంది పడింది. అది చూసి చుట్టూ ఉన్నవారు తెగ నవ్వుకున్నారు. జరిగిన ఘటనకు ఆమె కూడా పగలబడి నవ్వుకుంది.

ఇవి కూడా చదవండి

ఇదంతా వీడియో తీసిన కొందరు వ్యక్తులు యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. దాంతో నెటింట్లో వీడియో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి