హెలికాప్టర్‌కు వేలాడుతూ పుల్‌అప్స్‌.. గిన్నిస్ వరల్డ్ రికార్డును బ్రేక్‌ చేసిన యూట్యూబర్

ఓ వ్యక్తి హెలికాఫ్టర్‌కు వేలాడుతూ ఒక్క నిమిషంలో అత్యధికంగా ఫుల్‌ అప్‌ చేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు. ఆకాశంలో ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు వేలాడుతూ పుల్-అప్ లు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.

హెలికాప్టర్‌కు వేలాడుతూ పుల్‌అప్స్‌.. గిన్నిస్ వరల్డ్ రికార్డును బ్రేక్‌ చేసిన యూట్యూబర్
Guinness
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 07, 2022 | 8:07 AM

ఒక్క నిమిషంలో ఎన్ని పుల్‌అప్స్ చేయగలరు..? ప్రస్తుత రికార్డు చైనాకు చెందిన హాంగ్‌ జాంగ్‌టౌ పేరిట 74 పుష్పాలు చేసిన రికార్డ్‌ ఉంది. కానీ ఓ వ్యక్తి హెలికాఫ్టర్‌కు వేలాడుతూ ఒక్క నిమిషంలో అత్యధికంగా ఫుల్‌ అప్‌ చేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు. ఆకాశంలో ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు వేలాడుతూ పుల్-అప్ లు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. నెదర్లాండ్స్‌లోని ఇద్దరు యూట్యూబర్‌ ప్రమాదకరమైన సాహసం చేశారు. ఫిట్‌నెస్‌ ఔత్సాహికులు స్టాన్‌బ్రౌనీ, ఆర్యన్‌ ఆల్బర్స్‌ బెల్జియంలోని హూవెనెన్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో హెలికాఫ్టర్‌ నుండి వేలాడుతూ పుల్‌అప్‌ ఛాలెంజ్‌ చేశారు.

ఈ నేపథ్యంలోనే జులై 6న బెల్జియంలోని ఆంట్‌వెర్ప్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో గిన్నిస్‌ రికార్డ్స్‌ అధికారుల సమక్ష్యంలో ఈ ఫీట్‌ సాధించారు. ఇందుకు స్టాన్‌ బ్రౌనీ, అర్జెన్‌ అల్బెర్స్‌ పోటీ పడగా.. బ్రౌనీ నిమిషంలో 25 పుల్‌అప్స్‌ చేసి రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 23 పుల్‌అప్స్‌తో ఆర్మేనియాకు చెందిన రోమన్‌ సరద్యాన్‌ పేరిట ఉన్న రికార్డును ఇతడు బద్దలుకొట్టాడు. ఏది ఏమైనా ఈ సాహసానికి సంబంధించిన వీడియో మాత్రం ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి