Friendship Day Gift Ideas: మీ బెస్ట్ ఫ్రెండ్‌ను సర్‌ప్రైజ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఐడియాలు మీ కోసమే..
Happy Friendship Day 2022 Gift Ideas: మీ బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్, ఫ్రెండ్స్ కోసం స్పెషల్ గిఫ్ట్ ఐడియాలు.. ఇండియాలో ఆగస్టు 7న అంటే ఇవాళ ఫ్రెండ్‌షిప్ డే జరుపుకుంటారు. ఈ సందర్బంలో వారికి ఓ మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటే ఈ ఐడియాలు మీ కోసమే..

స్నేహం అంటే అనిర్వచనీయం.. స్నేహం అంటే ఓ అపూర్వం.. స్నేహం అంటే.. ఇలా ఎంత చెప్పినా ముగింపు ఉండదు. పుట్టినప్పటి నుంచి లభించని అందమైన బంధం.. కానీ ఆ బంధాన్ని మీరే ఎంచుకోవాలి. నిజమైన స్నేహితుడు జీవితంలోని ప్రతి మలుపులో మీతో భుజం భుజం కలిపి నిలుస్తాడు. ఆనందం, దుఃఖంలో మీకు దగ్గరగా ఉంటాడు. మీ కలలను నిజమైన స్నేహితుడితో పంచుకోండి. మీ ప్రతి రహస్యాన్ని అతనికి చెప్పండి. స్నేహం అనే ఈ అందమైన బంధాన్ని సెలబ్రేట్ చేసుకోవడానకి.. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం నాడు స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఆగస్టు 7న భారతదేశంలో స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఈ సందర్భంలో మీరు మీ మిత్రులకు బహుమతులు ఇవ్వడం ద్వారా మీ స్నేహితులను ఆశ్చర్యపరచవచ్చు. అమ్మాయిలు ఎంతగానో ఇష్టపడే బహుమతుల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. ఈ బహుమతిని మీ స్నేహితుడికి లేదా స్నేహితుడికి ఇవ్వవచ్చు.
గడియారం: మీ బెస్ట్ ఫ్రెండ్ వాచ్ ధరించడం చాలా ఇష్టపడితే.. ఫ్రెండ్‌షిప్ డే రోజున వాచ్ ఇవ్వడానికి సంకోచించకండి. వారి వద్ద ఇప్పటికే చాలా గడియారాలు ఉన్నాయని మీరు అనుకుంటే.. వారి వాచ్ సేకరణకు మరొక వాచ్‌ని జోడించవచ్చు.
టీ-షర్ట్: మీ ప్రత్యేక స్నేహితుడికి మీరు ఫార్మల్ దుస్తులలో తెలివిగా ఇష్టపడితే.. మీరు ఫార్మల్ షర్ట్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. వారికి నచ్చిన రంగులో చొక్కాను తీసుకోండి. వారికి ఆ చొక్కను స్పెషల్ ప్యాకింగ్‌లో అందించండి.
స్టైలిష్ ల్యాప్‌టాప్ బ్యాగ్: మీరు మీ స్నేహితుడికి స్టైలిష్ ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. మీ స్నేహితుడికి ల్యాప్‌టాప్ లేకపోతే.. వారికి ల్యాప్‌టాప్ కొనమని సరదాగా అడుగుతూ.. ఈ బ్యాగ్‌తో నోట్ రాయండి. ఇది సరదాగా ఉంటుంది.
మినీ పర్సులు: పర్సులు లేదా బ్యాగ్‌లను అమ్మాయిలు తెగ ఇష్టపడతారు. ఇలాంటి సమయంలో వారికి మినీ పర్స్ కొనుగోలు చేసి బహుమతిగా ఇవ్వవచ్చు.
ఫ్రెండ్‌షిప్ బ్రాస్‌లెట్: ఈ రోజున మీరు మీ స్నేహితుడి మణికట్టుపై ఫ్రెండ్‌షిప్ బ్రాస్‌లెట్ లేదా బ్యాండ్‌ని కట్టుకోవచ్చు. కావాలంటే వారికి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌కి బదులుగా నచ్చిన బ్రాస్‌లెట్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు.
బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్ కాఫీ మగ్: మీ స్నేహితుడుకి కాఫీ ప్రియుడు అయితే.. వారు రోజు తాగడానికి కాఫీ మగ్గును గిఫ్ట్ కూడా అందించవచ్చు. ఆ కాఫీ మగ్గుపై బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్ అర్థం వచ్చేలా ప్రింటెడ్ కాఫీ మగ్‌ని బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ బహుమతిని మీ స్నేహితుడు ఖచ్చితంగా ఇష్టపడతారు.
ఫోటో ఫ్రేమ్: ఇది కూడా అద్భుతమై ఐడియా అని చెప్పవచ్చు. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి దిగిన ఓ ఫోటోను ఫ్రో చేయించి ఇవ్వవచ్చు. ఇందులో కనిపించే మీ మిత్రుడి ఫోటో కానీ మీ ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటో చాలా ప్రత్యేకంగా ఉండిపోతుంది. అంతే కాదు ఈ చిత్రాన్ని చిరస్మరణీయమైన క్షణంలో తీసుకున్నదై ఉంటే మరింత బాగుంటుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..
