Curd Face Pack : పెరుగుతో మీ ముఖాన్ని మరింత అందంగా కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

మీరు కనీసం వారానికి ఒకసారి మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంది చర్మ సంరక్షణ కోసం పెద్దగా ఏది పట్టించుకోరు..కానీ, వర్షాకాలంలో చర్మానికి మరింత జాగ్రత్త అవసరం.

Curd Face Pack : పెరుగుతో మీ ముఖాన్ని మరింత అందంగా కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు.. ఎలాగంటే..?
Curd Face Pack
Follow us

|

Updated on: Aug 07, 2022 | 8:30 AM

మీరు మచ్చలేని, మెరిసే చర్మం కావాలనుకుంటున్నారా..? అయితే, మీరు కనీసం వారానికి ఒకసారి మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంది చర్మ సంరక్షణ కోసం పెద్దగా ఏది పట్టించుకోరు..కానీ, వర్షాకాలంలో చర్మానికి మరింత జాగ్రత్త అవసరం. కాబట్టి మీ చర్మానికి మేలు చేసే సహజమైన వస్తువులను ఉపయోగించడం చాలా ముఖ్యం. ఇంట్లో లభించే పెరుగుతో మీ ముఖ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

పెరుగు ఆరోగ్యకరమైన, సమస్య లేని చర్మాన్ని అందించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగులో కాల్షియం, ప్రొటీన్లు ఇంకా అనేక ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. అంతే కాదు, పెరుగులో విటమిన్లు సి, డి, ఎ ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి మన చర్మానికి చాలా మేలు చేస్తాయి.

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మన చర్మంలో ఉండే డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. ముడతలు రాకుండా చేస్తుంది. లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా మార్చే, మొటిమలను తొలగించే లక్షణాలను కలిగి ఉంటుది. ఇది ముఖంపై మెరుపును తెస్తుంది.

ఇవి కూడా చదవండి

పెరుగు, నిమ్మకాయ పేస్ట్‌తో ముఖానికి మసాజ్‌ చేయటం కూడా మంచిది. అందుకోసం ఒక గిన్నెలో పెరుగు తీసుకుని, అందులో ఒక చిన్న నిమ్మకాయ రసం కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి కనీసం 20 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంలోని ట్యానింగ్ తొలగిపోయి ముఖం మెరిసిపోతుంది.

శనగ పిండి, దోసకాయ స్క్రబ్బర్ కలపడం ద్వారా మీరు మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయవచ్చు. అందులో ఒక చెంచా శెనగపిండి, రెండు చెంచాల పెరుగు వేసి బాగా కలిపి చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.

పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇది మొటిమలు, ఇతర చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ రెసిపీ కోసం, రెండు చెంచాల పెరుగు, అర చెంచా పసుపును బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని నేరుగా ముఖంపై అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇప్పుడు తేలికపాటి చేతులతో ముఖాన్ని మసాజ్ చేసి నీటితో శుభ్రం చేసుకోవాలి.

మీ ముఖం పొడిబారినట్లయితే, తేనె,పెరుగు కలిపి ఉపయోగించండి. ఇది మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కాస్త పెరుగు తీసుకుని అందులో తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని మీ ముఖమంతా అప్లై చేసి కాసేపటి తర్వాత ముఖం కడుక్కోవాలి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే