Telangana: విధి వెంటాడినా.. అదృష్టం వెంట నిలిచింది.. రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఉచితంగా లాటరీలో

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాన్ని లాటరీ ద్వారా దేవుడు కరుణించాడు. ఖరీదైన వైద్యం కోసం ఎదురు చూస్తున్న పసి ప్రాణాన్ని నిలబెట్టాడు. ఈ అరుదైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో వెలుగు చూసింది.

Telangana: విధి వెంటాడినా.. అదృష్టం వెంట నిలిచింది.. రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఉచితంగా లాటరీలో
Rare Disease
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 07, 2022 | 12:31 PM

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాన్ని లాటరీ ద్వారా దేవుడు కరుణించాడు. ఖరీదైన వైద్యం కోసం ఎదురు చూస్తున్న పసి ప్రాణాన్ని నిలబెట్టాడు. ఈ అరుదైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో వెలుగు చూసింది. మండలంలోని రేగుబల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ స్టెల్లా దంపతుల కుమార్తె ఎలెన్ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతుంది. జన్యుపరమైన వ్యాధి బారిన పడి రెండేళ్లుగా కొట్టుమిట్టాడుతోంది. నిరుపేద కుటుంబానికి చెందిన వీరు దాతల సహాయంతో హైదరాబాద్ లోని రెయిన్‌బో హాస్పిటల్‌లో చికిత్స చేయిస్తున్నారు. అయితే ఈ వ్యాధి పూర్తిగా నయం కావడానికి కావలసిన ఇంజెక్షన్ విలువ 16 కోట్ల రూపాయలుగా ఉంది. హాస్పిటల్ ఖర్చులకే డబ్బులు లేక దాతల కోసం ఎదురుచూస్తున్న వీరికి ఆ ఇంజక్షన్ కోసం ఏం చేయాలో తెలియక బాధపడుతుండగా అనుకోని అదృష్టం వరించింది.

స్విట్జర్లాండ్‌కు చెందిన నోవర్టీస్ కంపెనీ ఈ ఇంజక్షన్ అందుబాటులో లేని దేశాలలో లాటరీ నిర్వహించి ఏడాదికి 100 ఇంజక్షన్ లు ఉచితంగా అందిస్తున్నది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ, భారతదేశ ప్రభుత్వ అనుమతి కూడా ముందుగానే పూర్తీ చెయ్యాలి. రెయిన్బో హాస్పిటల్ నందు పాపకు చికిత్స అందిస్తున్న డా. రమేష్.. పాప తల్లిదండ్రులతో రిజిస్ట్రేషన్ చేయించారు. అదృష్టం కొద్దీ వీరికి లాటరీలో ఆ ఇంజక్షన్ వచ్చింది దీంతో పాప తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు..తమకు దక్కదు అనుకున్న చిన్నారి లాటరీ ద్వారా ఇంజక్షన్ లభించడంతో పునర్జన్మ పొందింది. పాపకు చికిత్స అందించడంలో సహాయ పడిన ప్రతి ఒక్కరికీ ప్రవీణ్ కుమార్ స్టెల్లా దంపతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి