Viral Video: అసలైన మానవత్వానికి సాక్షం వీళ్లు.. పెంపుడు కుక్క కోసం ప్రాణాలకు తెగించిన చిన్నారులు..

ఈ వార్త రాసే సమయానికి కోటి మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోను 10 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ప్రజలు కూడా వీడియోపై రకరకాలుగా స్పందించారు. కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.

Viral Video: అసలైన మానవత్వానికి సాక్షం వీళ్లు.. పెంపుడు కుక్క కోసం ప్రాణాలకు తెగించిన చిన్నారులు..
Child Fight Python
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 07, 2022 | 10:27 AM

Viral Video: తన ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడటం అంత సులువు కాదు. ప్రత్యేకించి ఒక మూగజీవిని రక్షించటం కోసం అయితే ఇక కష్టమేనని చెప్పొచ్చు…కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వీడియో ఇందుకు భిన్నమైనది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది పిల్లలు కొండచిలువ నుండి కుక్క ప్రాణాన్ని రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి మానవత్వానికి ఉదాహరణగా నిలిచారు. కొండచిలువను చూసి ఎంతో బలవంతులమని చెప్పుకునే వాళ్లే..తప్పించుకు పారిపోయి ప్రాణాలు దక్కించుకుంటారు. అలాంటిది..ఓ ముగ్గురు అబ్బాయిలు తమ పెంపుడు కుక్క ప్రాణాలను కాపాడుకోవడానికి కొండచిలువతో పెద్ద యుద్ధమే చేశారు.

ఓ పెద్ద కొండచిలువ కుక్కను వేటాడేందుకు దాన్ని పట్టుకోవడం వీడియోలో చూడవచ్చు. కుక్క పూర్తిగా కొండచిలువ పట్టులో ఉంది. కొండచిలువ పట్టునుండి తప్పించుకుని బయటపడటానికి దాని శాయ శక్తుల ప్రయత్నిస్తోంది. కానీ, పైథాన్‌ పట్టును మరింత బలం పెంచింది. పాపం ఆ కుక్క ఎంత ప్రయత్నించినప్పటికీ కొండచిలువ బారి నుండి తనను తాను విడిపించుకోదు. అంతలోనే ఈ దశ్యం ముగ్గురు అబ్బాయిల కంట పడింది. దాంతో వారు వెంటనే తమ పెంపుడు కుక్క ప్రాణాన్ని కాపాడటానికి కొండచిలువతో కలబడ్డారు. పిల్లల్లో ఒకడు రాయిని, మరో పిల్లవాడు కర్రను చేతిలోకి తీసుకున్నారు. మూడవ పిల్లవాడు మరింత రిస్క్‌ చేసి కొండచిలువ నోటిని నొక్కిపట్టుకున్నాడు. ఇక ముగ్గురు కలిసి కుక్కను కొండచిలువ బారి నుండి విడిపించడానికి ప్రయత్నిస్తాడు. ముందుగా పాము తలపై కర్రతో కొట్టి పట్టుకున్నారు. ఆ తర్వాత వెంటనే చేతితో పామును లాగటం మొదలుపెట్టారు. అతి కష్టంమీద ప్రయత్నించి కొండచిలువ నుంచి కుక్క ను కాపాడారు. ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్న కుక్క ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. బతుకుజీవుడా అని కొండచిలువ నుండి దూరంగా పారిపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో @_figensezgin అనే ఖాతా ద్వారా Twitterలో షేర్‌ చేయబడింది. వార్తలు రాసే వరకు కోటి మందికి పైగా వీక్షించారు. కాగా, ఈ వీడియోను 10 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ప్రజలు కూడా వీడియోపై కామెంట్ చేయడం ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. వీడియోపై వ్యాఖ్యానిస్తూ, ‘కొండచిలువ నుండి కుక్కను రక్షించిన ఈ పిల్లవాడు నిజంగా ధైర్యవంతుడు’ అని రాశారు. ‘కుక్క ప్రాణాలను కాపాడటం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఈ ముగ్గురు బాలురు మానవత్వానికి ఉదాహరణగా నిలిచారు అంటూ మరో నెటిజన్‌ రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
కంగువా ఎఫెక్ట్.. కోలీవుడ్‌లో కొత్త వివాదం..టాలీవుడ్‌లో ప్రకంపనలు
కంగువా ఎఫెక్ట్.. కోలీవుడ్‌లో కొత్త వివాదం..టాలీవుడ్‌లో ప్రకంపనలు
ఈ ఆలయంలో దేవుళ్ళకు కాదు రాయల్ ఎన్‌ఫీల్డ్ కి పూజలు.. ఎందుకంటే..
ఈ ఆలయంలో దేవుళ్ళకు కాదు రాయల్ ఎన్‌ఫీల్డ్ కి పూజలు.. ఎందుకంటే..
గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ..
గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ..
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
బంగాళ దుంప రసంతో అందాన్ని పెంచుకోండిలా..!
బంగాళ దుంప రసంతో అందాన్ని పెంచుకోండిలా..!
జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.601తో ఏడాది పాటు 5జీ నెట్‌!
జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.601తో ఏడాది పాటు 5జీ నెట్‌!
జై మహారాష్ట్ర! అభివృద్ధి గెలిచింది.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్
జై మహారాష్ట్ర! అభివృద్ధి గెలిచింది.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు మధుమేహం వస్తుందని హెచ్చరిక
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు మధుమేహం వస్తుందని హెచ్చరిక
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!