AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

White Hair Problem: జుట్టు పలుచబడి, తెల్లగా మారుతోందా..? అయితే ఈ పని చేయండి..!

తెల్లజుట్టుతో పాటు జట్టు రాలడం కూడా చాలా మందిలో ప్రధాన సమస్యగా మారింది. ఇందులో బయటపడేందుకు మీకు అందుబాటులో ఉండే పదార్థాలతో ఈ చిట్కాను అమలు చేయండి.

White Hair Problem: జుట్టు పలుచబడి, తెల్లగా మారుతోందా..? అయితే ఈ పని చేయండి..!
White Hair Solution
Jyothi Gadda
|

Updated on: Aug 07, 2022 | 11:05 AM

Share

White Hair Problem: ప్రస్తుతం కాలంలో చాలా మందికి వయస్సుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు సమస్య వేధిస్తంఓది. మారిన ఆహారపు అలవాట్లు, ప్రస్తుత వాతావరణం కారణంగా జుట్టు సమస్యలు వేధిస్తున్నాయంటున్నారు వైద్య నిపుణులు..అయితే, తెల్లజుట్టుతో పాటు జట్టు రాలడం కూడా చాలా మందిలో ప్రధాన సమస్యగా మారింది. ఇందులో బయటపడేందుకు మీకు అందుబాటులో ఉండే పదార్థాలతో ఈ చిట్కాను అమలు చేయండి. అద్భుత ఫలితం మీరే గమనిస్తారు. దీని వల్ల జుట్టు రాలే సమస్య తగ్గడం సహా తెల్ల జుట్టు కూడా రాకుండా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కాకరకాయ రసం: కాకరకాయ రసం మీజుట్టుకు సంజీవనిలా పనిచేస్తుంది. కాకరకాయ ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. దీని రసం మన చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాకర రసంలో విటమిన్లు B1, B2, B3 వంటి పోషకాలు, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్, జింక్, ఫాస్పరస్ ,మాంగనీస్ వంటి ఖనిజాలు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి.

ఉల్లిపాయ రసం: ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడడం వల్ల వెంట్రుకలు శుభ్రంగా మారడం సహా రక్త ప్రసరణ మెరుగవుతుంది. జుట్టు కుదుళ్లలో శుభ్రంగా ఉండడం మూలంగా జుట్టు రాలే సమస్య తగ్గిపోయే అవకాశం ఉంది. ఉల్లి రసాన్ని వినియోగించడం వల్ల జుట్టు కుదుళ్లలో దుమ్ము, ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ చేరవట. వెంట్రుకలు బాగా పెరగాలన్నా, మందంగా ఉండాలన్నా ఉల్లిపాయ రసం ఎంతో మేలు చేస్తుందట. ఉల్లి రసాన్ని జుట్టుకు పట్టించడం లేదా కొబ్బరినూనెతో కలిపి దీన్ని మసాజ్ చేయవచ్చు. వారం రోజుల తర్వాత మీకే వ్యత్యాసం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి