Toll Plazas: వాహనాల నంబర్ ప్లేట్ మళ్లీ మారుస్తున్నారా..? ఇదిగో పూర్తి క్లారిటీ

ఫాస్ట్‌ట్యాగ్ వల్ల ప్రజల సమయం ఆదా అవుతుందని. టోల్ సమయంలో ప్రజల వాహనాల వల్ల వృథా అయ్యే ఇంధనం నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని చెప్పారు. కానీ,

Toll Plazas: వాహనాల నంబర్ ప్లేట్ మళ్లీ మారుస్తున్నారా..? ఇదిగో పూర్తి క్లారిటీ
Motor Vehicle Law
Follow us

|

Updated on: Aug 07, 2022 | 1:38 PM

హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. అయితే వాహనదారులు ఈ మార్గాల గుండా వెళ్ళడానికి టోల్ టాక్స్ చెల్లించాలి. గతంతో పోలిస్తే టోల్ ఛార్జీలు కూడా భారీగా పెరిగాయి. ఇప్పటి వరకు, టోల్ వసూలు మాన్యువల్‌గా జరిగేది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా టోల్ వసూలు కోసం ఫాస్ట్‌ట్యాగ్ సేవను తీసుకువచ్చారు. ఫాస్ట్‌ట్యాగ్ వల్ల ప్రజల సమయం ఆదా అవుతుందని. టోల్ సమయంలో ప్రజల వాహనాల వల్ల వృథా అయ్యే ఇంధనం నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని చెప్పారు. కానీ, ఫాస్ట్‌ట్యాగ్ సౌకర్యం పెద్దగా ప్రయోజనకరంగా కనిపించలేదు. దీని వల్ల టోల్‌ప్లాజా వద్ద పొడవైన లైన్లలో ఎలాంటి తేడా కనిపించలేదు. ప్రజల ఇంధన వృధా తగ్గలేదు. అయితే, ప్రభుత్వం అంచనా మేరకు ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా టోల్ వసూలు ఖచ్చితంగా పెరిగింది.

ఇప్పుడు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కొత్త వ్యవస్థను తీసుకురావాలని కేంద్ర యోచిస్తోంది.. ఇప్పుడు ఎక్కడ చూసిన ANPR (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్) వ్యవస్థను అమలు చేయడం గురించి చర్చ జరుగుతోంది. ఇది కాకుండా, GPS సిస్టమ్ గురించి కూడా వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.. రానున్న కాలంలో ఈ వ్యవస్థల ద్వారా టోల్ వసూలు చేయనున్నారు.

మరోవైపు, ఫిజికల్ టోల్ ప్లాజాను తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఇందుకోసం నేషనల్ హైవే అథారిటీ కసరత్తు చేస్తోంది. ఇందులో కొత్త సదుపాయాన్ని జోడించడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా దీని గురించి సమాచారం ఇచ్చారు. కొత్త ఏర్పాట్లలో జీపీఎస్‌ టోల్‌ సిస్టమ్‌, కొత్త నంబర్‌ ప్లేట్‌ సిస్టమ్‌ అమలుపై చర్చలు జరుగుతున్నట్టుగా తెలిపారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఇది ఎలా పనిచేస్తుందంటే.. ఇప్పటి వరకు హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు వాహనంలో అమర్చిన ఫాస్ట్‌ట్యాగ్‌లో డబ్బు మినహాయించబడుతోంది. కానీ కొత్త సాంకేతికత అమలులోకి వచ్చిన తర్వాత, మీ వాహనం నంబర్ ప్లేట్ ద్వారా ఫాస్ట్ ట్యాగ్ నుండి డబ్బు తీసివేయబడుతుంది. దీని వల్ల ప్రయోజనం ఏమిటంటే ప్రజలు ఇప్పుడు కిలోమీటర్ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం ఇప్పుడు రెండు ఎంపికలను అన్వేషిస్తోందని నితిన్ గడ్కరీ రాజ్యసభలో చెప్పారు – శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్.. ఇక్కడ కారుకు GPS ఉంటుంది. టోల్ నేరుగా కారు యజమాని బ్యాంక్ ఖాతా నుండి తీసివేయబడుతుంది. మరొక ఎంపిక నంబర్ ప్లేట్ ద్వారా టోల్ చెల్లింపు. దీని కోసం సిస్టమ్‌లోని హైవేపై ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ చేయబడుతుంది. వాహనంలోకి ప్రవేశించిన తర్వాత, నంబర్ ప్లేట్ స్కాన్ చేయబడుతుంది. వాహనం ఎక్కడ నుండి బయలుదేరుతుందో దాని దూరాన్ని బట్టి, ప్రయాణీకుల ఖాతా నుండి డబ్బు కట్‌ అవుతుంది. అయితే నంబర్ ప్లేట్ ద్వారా టోల్ చెల్లింపునకు కొత్త టెక్నాలజీని వినియోగిస్తారా లేదా పాత నంబర్ ప్లేట్ మాత్రమే పని చేస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కొత్త నంబర్ ప్లేట్‌ను అమర్చి, దానిని కొన్ని సాఫ్ట్‌వేర్‌లకు అనుసంధానం చేసి, దాని నుండి టోల్ మినహాయించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి