D-Mart Shopping Tips: ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి..! తక్కువ డబ్బుకు ఎక్కువ వస్తువులు కొనాలంటే…
DMartలో తక్కువ ధరలకు షాపింగ్ చేయడానికి చిట్కాలు తెలుసుకోండి. పండుగల ఆఫర్‌లలో (బై వన్ గెట్ వన్, 50% డిస్కౌంట్) షాపింగ్ చేయండి. ధరల లేబుల్‌లను చదవండి, సరిపడా సమయం కేటాయించండి. నెల 10వ తేదీకి ముందు రద్దీని నివారించండి. ఇలా DMartలో తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులు కొనుగోలు చేయవచ్చు.

రిటైల్ మార్కెట్లో Dmart ఖ్యాతి అంతా ఇంతా కాదు. Dmart అనేది అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన మార్కెట్. ఇది ఒక సరసమైన కిరాణా దుకాణం. ఇక శని, ఆదివారాల్లో Dmart రద్దీ మామూలుగా ఉండదు. అయితే, Dmart లో అన్ని వస్తువులు తక్కువ ధరలకు లభిస్తాయన్నది నిజం. కానీ, మీరు కొంచెం తెలివిగా ఉండి, చిన్న చిట్కాలను ప్రయత్నిస్తే.. మీరు Dmart లో ఇంకా తక్కువ ధరలకు షాపింగ్ చేయవచ్చు. మీరు తక్కువ డబ్బుతో ఎక్కువ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. అలాంటి షాపింగ్ టిక్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..
DMart లో లాభదాయకంగా షాపింగ్ చేయాలనుకుంటున్నారా? తక్కువ డబ్బుకు ఎక్కువ వస్తువులను కొనడానికి ఇక్కడ బంపర్ ఆఫర్ ఉంది. సెలవు దినాల్లో DMart లో షాపింగ్ చాలా బాగుంటుంది. ఆ సమయంలో DMart అన్ని వస్తువులపై భారీ ఆఫర్లను అందిస్తుంది. బై వన్ గెట్ వన్, 50 శాతం డిస్కౌంట్ వంటి ఆఫర్లు ఉంటాయి. ఆ సమయంలోనే మీకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయొచ్చు. ముఖ్యంగా సంక్రాంతి, క్రిస్మస్, నూతన సంవత్సర సమయంలో షాపింగ్ చేయడానికి రెడీగా ఉండండి.
DMart అంటే కేవలం పప్పులు, ఉప్పు మాత్రమే కాదు. ఎలక్ట్రానిక్స్, వంట సామాగ్రి కూడా తక్కువ ధరలకు లభిస్తాయి. బెస్ట్ ఆఫర్లు ఎప్పుడు వస్తాయో తెలుసుకుని వాటిని కొనాలి. DMart కి వెళ్ళేటప్పుడు అక్కడ పోస్ట్ చేసిన ప్రతి బోర్డులోని ధరలను చదవండి. అలాగే, ఎంత శాతం తగ్గింపు అందిస్తున్నారో చూడండి. చాలా మంది ధర లేబుల్‌లను చూడకుండానే వెళ్ళిపోతారు. మీరు వాటిని సరిగ్గా చదివితే, ఆ ఉత్పత్తులపై తగ్గింపు మీకు అర్థమవుతుంది. మీరు తదనుగుణంగా కొనుగోలు చేయవచ్చు.
DMart లో షాపింగ్ అంత త్వరగా ముగియదు. ఆ షాపింగ్ కోసం కనీసం ఒక గంట నుండి రెండు, మూడు గంటలు కేటాయించాలి. మీరు షాపింగ్ చేయడానికి తొందరపడితే, ఇక్కడ తక్కువ ధరకు ఉత్పత్తులు దొరకవు. డిస్కౌంట్ లో ఏముంది? ఆఫర్లు ఏమిటో తెలుసుకోవడానికి కనీసం ఒక గంట సమయం పడుతుంది. కాబట్టి మాల్ అంతా తిరిగి చూసి ఆఫర్లు ఏమిటో తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిది.
ప్రతి నెలా 10వ తేదీకి ముందు మీరు ఎప్పుడూ DMart కి వెళ్లకూడదు. ఎందుకంటే ఆ సమయంలో DMart రద్దీగా ఉంటుంది. అందరికీ జీతం వచ్చి ఉంటుంది. కాబట్టి అందరూ నెలవారి వస్తువుల కోసం DMart కి వెళతారు. ఆ సమయంలో మీరు డిస్కౌంట్లపై ఆఫర్లను సరిగా చూడలేరు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి







