Black Magic: చేతబడి చేస్తూ ఐదేళ్ల బాలికను కొట్టిచంపిన తల్లిదండ్రులు.. అదంతా వీడియో కూడా తీశారు..
దుష్టశక్తులను పారద్రోలేందుకు ఐదేళ్ల బాలికపై చేతబడి చేస్తూ తల్లిదండ్రులు ఆమెను కొట్టి చంపారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు.
Black Magic: చేతబడి చేస్తూ ఐదేళ్ల బాలికను అతి కిరాతకంగా కొట్టి చంపేశారు కన్న తల్లిదండ్రులు..ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. దుష్టశక్తులను పారద్రోలేందుకు ఐదేళ్ల బాలికపై చేతబడి చేస్తూ తల్లిదండ్రులు ఆమెను కొట్టి చంపారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. శుక్రవారం-శనివారం రాత్రి మధ్య ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తండ్రి సిద్ధార్థ్ చిమ్నే (45), తల్లి రంజన (42), అత్త ప్రియా బన్సోద్ (32)లను పోలీసులు అరెస్టు చేశారు. క్షుద్రపూజలు చేసి బాలిక స్పృహతప్పి పడిపోవడంతో నిందితులు శనివారం ఉదయం ఆమెను దర్గాకు తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి పరారయ్యారు.
సుభాష్ నగర్‌కు చెందిన చిమ్నే యూట్యూబ్‌లో స్థానిక న్యూస్ ఛానెల్‌ని నడుపుతున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గత నెల గురు పూర్ణిమ రోజున తన భార్య,5, 16 ఏళ్ల ఇద్దరు కుమార్తెలతో కలిసి తకల్‌ఘాట్ ప్రాంతంలోని దర్గాకు వెళ్లాడు. అప్పటి నుండి ఆ వ్యక్తి తన చిన్న కుమార్తె ప్రవర్తనలో కొంత మార్పును గమనించారు. బాలికను కొన్ని దుష్ట శక్తులు ఆవహించాయని ఇంటిల్లిపాది నమ్మారు. వాటిని తరిమికొట్టేందుకు చేతబడి చేయాలని నిర్ణయించుకున్నట్లు అధికారి తెలిపారు.
అమ్మాయి తల్లిదండ్రులు, అత్త కలిసి బాలికపై రాత్రిపూట చేతబడి చేయడం ప్రారంభించారు. దానిని వీడియో కూడా తీశారు. ఆ తరువాత వీడియో ఫుటేజ్‌ని పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. వీడియోలో ఏడుస్తున్న చిన్నారిని నిందితులు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. బాలిక ప్రశ్నలను అర్థం చేసుకోలేకపోయిందని అధికారి తెలిపారు. ఈ సమయంలో ముగ్గురు నిందితులు బాలికను దారుణంగా కొట్టారని, ఆ తర్వాత ఆమె నేలపై స్పృహతప్పి పడిపోయిందని అధికారి తెలిపారు. దీంతో నిందితులు శనివారం ఉదయం బాలికను దర్గాకు తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ క్రమంలోనే ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుకు అనుమానం వచ్చి తన మొబైల్ ఫోన్‌లో నిందితులు ప్రయాణించిన కారును ఫోటో తీశాడు. ఆసుపత్రి వైద్యులు బాలిక మృతి చెందినట్లు నిర్ధారించి పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. రాణాప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు నిందితుల ఇంటికి చేరుకుని వారిని అరెస్ట్ చేసినట్లు అధికారి తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి