Viral Video: క్లాక్ టవర్‌పై పిడుగు.. కెమెరాలో రికార్డయిన దృశ్యం.. నెట్టింట వీడియో వైరల్‌

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సౌదీ అరేబియాలోని మక్కాలో క్లాక్ టవర్‌పై పిడుగు పడిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో ఒక్కసారిగా మెరుపులు రావడం, ఆ తర్వాత ఆకాశమంతా వెలుగులు విరజిమ్మడం

Viral Video: క్లాక్ టవర్‌పై పిడుగు.. కెమెరాలో రికార్డయిన దృశ్యం.. నెట్టింట వీడియో వైరల్‌
Lightning Strike
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 08, 2022 | 1:03 PM

Viral News: ఆకాశంలో అప్పుడప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్నింటిన్ని స్వయంగా చూడగలుగుతాం.. కొన్నింటిన్ని తమ కెమెరాల్లో బంధించి ఎవరైనా చూపిస్తే చూస్తాం..ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈవీడియో అలాంటిదే. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సౌదీ అరేబియాలోని మక్కాలో క్లాక్ టవర్‌పై పిడుగు పడిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో ఒక్కసారిగా మెరుపులు రావడం, ఆ తర్వాత ఆకాశమంతా వెలుగులు విరజిమ్మడం ఈవీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వవిద్యాలయంలో ఖగోళ శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి అయిన ముల్హమ్ అనే యువకుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈవీడియో చూస్తున్న వారంతా ఆశ్చర్చపోతున్నారు. ఇప్పటివరకు ఈవీడియోను దాదాపు ఇప్పటివరకూ 15 లక్షల మందికి పైగా వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..