AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetic Foot Symptoms: డయాబెటిక్‌ బాధితుల్ని వెంటాడే పాదాల సమస్యలు.. లైట్‌గా తీసుకుంటే పెద్ద ప్రమాదమే..!

మధుమేహం అనేది కాలేయం, మూత్రపిండాల సమస్యలను కలిగిస్తాయని తెలిసిందే. కానీ, చక్కెర వ్యాధి మీ పాదాలకు కూడా సమస్యలను కలిగిస్తాయని మీకు తెలుసా? రక్తంలో అధిక చక్కెర స్థాయిలు..

Diabetic Foot Symptoms: డయాబెటిక్‌ బాధితుల్ని వెంటాడే పాదాల సమస్యలు.. లైట్‌గా తీసుకుంటే పెద్ద ప్రమాదమే..!
Diabetic Foot
Jyothi Gadda
|

Updated on: Aug 08, 2022 | 3:49 PM

Share

Diabetic Foot Symptoms: ప్రపంచంలో 415 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. వీరిలో పురుషులు, మహిళలతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. మధుమేహం అనేది కాలేయం, మూత్రపిండాల సమస్యలను కలిగిస్తాయని తెలిసిందే. కానీ, చక్కెర వ్యాధి మీ పాదాలకు కూడా సమస్యలను కలిగిస్తాయని మీకు తెలుసా? రక్తంలో అధిక చక్కెర స్థాయిలు నరాల వ్యాధికి కూడా దారితీస్తాయి. దీంతో పాదాలు మొద్దుబారతాయి. పాదాల్లో రక్త ప్రవాహం సరిగా జరక ఈ ఇబ్బంది తలెత్తుతుంది. ఈ పరిస్థితిని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. దీని కారణంగా కాలికి చిన్న గాయం తగిలినా అది తీవ్రంగా మారుతుంది.

డయాబెటిక్ ఫుట్ సమస్యలకు సంకేతాలు, లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం.. కాళ్లు మరియు పాదాలలో నొప్పి, మంట, తిమ్మిర్లు ఉంటాయి. పాదం లేదా బొటనవేలు కింద ఫుట్ అల్సర్స్ వస్తాయి. నొప్పి లేకపోయినా అశ్రద్ద చేయకుండా వెంటనే డాక్టర్‌కి చూపించాలి. చర్మం పొడిబారడం, పగుళ్లు, పొలుసులు, పొట్టు వంటి మార్పులు సంభవిస్తాయి. సకాలంలో చికిత్స చేయకపోతే ఈ కాలిస్ మరియు కార్న్స్ అల్సర్లుగా మారుతాయి. ఈ క్రింది సూచించిన కొన్ని జాగ్రత్తలు పాటించి మీ పాదాలను రక్షించుకోవచ్చు..మీ చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా చూసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. మందులను క్రమం తప్పకుండా సమయానికి తీసుకోవడం అవసరం. స్నానం చేసిన తర్వాత మీ పాదాలను ఆరబెట్టుకోవాలి. అనంతరం క్రీమ్ లేదా జెల్లీని పాదాలకు అప్లై చేయాలి. కాలి వేళ్ల మధ్య ఏమీ రాకుండా జాగ్రత్త వహించండి.

అప్పుడప్పుడు పాదాలను గోరువెచ్చని నీటిలో ఉంచితే మురికి లేకుండా శుభ్రంగా ఉంటాయి. పాదాలపై ఏర్పడిన మృతకణాలు(డెడ్‌ స్కీన్‌) కూడా ఊడిపోతుంది. దూమపానం అలవాటు ఉంటే మానేయడం మంచిది. చెప్పులు లేకుండా నడవడం, బురదలో పని చేయడం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఏ చిన్నా గాయానికి అయిన సరే, సొంత వైద్యం పనికిరాదు. గోళ్లను కత్తిరించేటప్పుడు జాగ్రత్త వహించాలి. గోరుతో పాటు చర్మం కట్టవకుండా జాగ్రత్త పడాలి. శుభ్రమైన పొడి సాక్స్ ధరించండి. సాక్స్ కాటన్‌‌వి అయితే సౌకర్యవంతంగా ఉంటుంది. మీ పాదాలు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి