AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: వందేళ్ల క్రితం మరణించిన చిన్నారి.. ఇప్పటికీ చెక్కుచెదరని శరీరంతో..

ఎన్నో టెస్టులు నిర్వహించిన శాస్త్రవేత్తలకు ఆమె అవయవాలు ఇంకా చెక్కుచెదరకుండా ఉన్నాయని, ఆమె మెదడు దాని అసలు పరిమాణంలో 50 శాతానికి మాత్రమే..

Viral News: వందేళ్ల క్రితం మరణించిన చిన్నారి.. ఇప్పటికీ చెక్కుచెదరని శరీరంతో..
Mummy2
Jyothi Gadda
|

Updated on: Aug 08, 2022 | 6:17 PM

Share

Viral News: భరోసాలియా లాంబార్డో.. సుమారు 100 సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల వయస్సులో మరణించింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆమెను చూడటానికి వేలాది మంది సందర్శకులు బారులు తీరుతున్నారు. అప్పటి చిన్నారి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత అందమైన మమ్మీ అని నివేదించబడింది. ఆమె తన రెండవ పుట్టినరోజుకు ముందు, డిసెంబర్ 2, 1920 న న్యుమోనియా కారణంగా మరణించింది. ఈ మేరకు వైద్యులు కూడా న్యుమోనియా స్పానిష్ ఫ్లూ వల్లే రోసాలియా లాంబార్డో చనిపోయినట్టుగా నిర్ధారించారు. ఇది 1918 ఇన్ఫ్లుఎంజా మహమ్మారి.

Mummy

రోసాలియా మరణానంతరం.. ఒక గాజు శవపేటికలో పెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. గాజు శవపెటికలో రోసాలియా మృతదేహాన్ని భద్రపరిచారు. దాన్ని ఇటలీలోని ఉత్తర సిసిలీలి పలెర్మోలోని కాపుచిన్ కాటాకాంబ్స్‌లో ప్రదర్శనకు ఉంచారు. పర్యావరణ కారకాల నుండి శరీరం క్షీణించకుండా కాపాడటానికి గాజు కేసు పూర్తిగా కెమికెల్స్‌తో నింపివేశారు. అయితే, రోసాలియా ఒక హాంటెడ్ యువతి అంటూ అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె కొంతమంది టూరిస్టులను చూసి రెప్పవాల్చినట్టుగా చేసిందనే పుకార్లు సైతం షీకారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు, కాపుచిన్ కాటాకాంబ్స్ పర్యాటక ఆకర్షణగా మారింది. ఎందుకంటే రోసాలియా శరీరం ఒక శతాబ్దం తర్వాత కూడా అసాధారణంగా భద్రపరచబడింది. దాంతో జీవించి ఉన్నవారు చనిపోయిన వారిని కలిసే ప్రదేశంగా పరిగణించబడుతోంది. కపుచిన్ కాటాకాంబ్స్‌లో దాదాపు 8,000 శవాలు, దాదాపు 1,284 మమ్మీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by All That’s Interesting (@all_thats_interesting)

అయినప్పటికీ, ఈ అవశేషాలలో, ఏదీ రెండు సంవత్సరాల వయస్సులో భద్రపరచబడలేదు. రక్షిత గ్లాస్ కేస్ లోపల ఆమె రాగి జుట్టు, చర్మం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయనేది అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. సంవత్సరాలుగా అసంఖ్యాక సిద్ధాంతాలు ఈ మమ్మీ చుట్టూ తిరుగుతున్నాయి. చాలామంది దీనిని రోసాలియా నకిలీ మైనపు ప్రతిరూపంగా విశ్వసించారు. అందుకోసం ఆమె శరీరంపై జరిపిన అనేక పరీక్షలు అటువంటి సిద్ధాంతాలన్నింటినీ కొట్టిపారేసినట్లు నివేదించబడింది.

ఎన్నో టెస్టులు నిర్వహించిన శాస్త్రవేత్తలకు ఆమె అవయవాలు ఇంకా చెక్కుచెదరకుండా ఉన్నాయని, ఆమె మెదడు దాని అసలు పరిమాణంలో 50 శాతానికి మాత్రమే కుంచించుకుపోయిందని వెల్లడించింది. అంతేకాకుండా, స్కాన్లు, ఎక్స్-రేలు కూడా రోసాలియా అస్థిపంజర నిర్మాణం చెక్కుచెదరకుండా ఉన్నట్లు నిర్ధారించాయి. 2 ఏళ్ల చిన్నారిని సిసిలియన్ టాక్సీడెర్మిస్ట్, ఎంబాల్మర్ ఆల్ఫ్రెడో సలాఫియా మమ్మీగా మార్చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి