Viral: పెద్ద సూట్‌కేస్‌తో అనుమానాస్పదంగా మహిళ.. ఆపి చెక్ చేసి కంగుతిన్న పోలీసులు
ప్రియుడితో ఆమెకు విబేదాలు వచ్చాయి. పెళ్లి చేసుకోమంటే ససేమేరా అన్నాడు. దీంతో ఆమె కోపం పెంచుకుంది. అప్పటివరకు కలిసి ఉన్న వ్యక్తిని రేజర్ సాయంతో ఖతం చేసింది.
Crime News: ఆమెకు పెళ్లైంది. కానీ పరాయి వ్యక్తి మోజులో పడింది. ఎంతలా అంటే మొగుడ్ని విడిచిపెట్టి లవర్‌తో వెళ్లిపోయేంతగా. అక్రమ సంబంధాలు అల్టిమేట్‌గా క్రైమ్‌కు దారితీస్తాయన్న విషయం తెలిసిందే. ఇక్కడ కూడా అదే జరిగింది. మ్యారేజ్ చేసుకోడానికి నిరాకరించడంతో.. అతి కిరాతకంగా గొంతు కోసి ప్రియుడ్ని ఖతం చేసింది. ఆపై డెడ్‌బాడీని మాయం చేసేందుకు మాస్టర్ స్కెచ్ వేసి.. ఈ కి’లేడి’ పోలీసులకు అడ్డంగా చిక్కింది. ఉత్తర్‌ప్రదేశ్(uttar pradesh) గాజియాబాద్(Ghaziabad)లో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎంక్వైరీ షురూ చేశారు. చనిపోయిన వ్యక్తిని సంభల్ ఏరియాకు చెందిన ఫిరోజ్‌గా ఐడెంటిఫై చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రీతి శర్మ అనే వివాహిత.. తన హస్బెండ్‌ను వదిలేసింది. ఫిరోజ్ అనే వ్యక్తితో గత 4 సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రీతి తనను పెళ్లి చేసుకోవాలని ఫిరోజ్‌ను కోరింది. అందుకు అతడు ససేమేరా అన్నాడు. దీంతో ఆమె కోపం పెంచకుంది. అదును చూసి ప్రియుడ్ని లేపేయాలని డిసైడయ్యింది. సరైన సమయం చూసి రేజర్‌తో అతని గొంతు కోసి చంపేసింది. అనంతరం.. డెడ్‌బాడీని పడేసేందుకు ఢిల్లీలోని సీలంపుర్ ఏరియాలో పెద్ద సూట్‌కేసు కొన్నది. ఆ ట్రాలీ సూట్‌కేసులో మృతదేహాన్ని పెట్టి తీసుకెళ్తుండగా ఆమెను గమనించారు పోలీసులు. అనుమానం వచ్చి ఫాలో అయ్యారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది.
In UP’s Ghaziabad, a woman was arrested by police when she was on her way to dispose off body of her live-in partner bundled in a suitcase. The woman identified as Preeti Verma killed her live-in partner Firoz over a dispute, police said. pic.twitter.com/fSMJuTD2Td
— Piyush Rai (@Benarasiyaa) August 8, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..