Andhra Pradesh: ఏపీలో పెరుగుతోన్న బీపీ, షుగర్ బాధితులు.. సర్వేలో షాకింగ్ విషయాలు..
Andhra Pradesh: ఈ తాజా హెల్త్ సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇందులో 26.35 శాతం అంటే 49,54,106 మందిలో రక్తపోటు, 25.64 శాతం అంటే 48,20,138 మందిలో మధుమేహం ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు.
Andhra Pradesh: ప్రజల్లో తమ ఆరోగ్య స్థితిగతులపై అవగాహన కల్పించేందుకు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్ (NCD) సర్వే చేపడుతోన్న సంగతి తెలిసిందే . ఇందులో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా మూడుకోట్ల మందికి పైగా మందికి వైద్య సిబ్బంది స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 1.87 కోట్ల మంది 30 ఏళ్ల వయస్సు పైబడిన వారే. అయితే ఈ తాజా హెల్త్ సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇందులో 26.35 శాతం అంటే 49,54,106 మందిలో రక్తపోటు, 25.64 శాతం అంటే 48,20,138 మందిలో మధుమేహం ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు.
ఆ జిల్లాలో భారీగా బాధితులు..
ఇక అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 6,82,189 మందిలో 30 ఏళ్లు పైబడిన వారిని స్క్రీనింగ్ టెస్టులు చేయగా అత్యధికంగా 38.02 శాతం మందిలో రక్తపోటు, 35.54 శాతం మందిలో మధుమేహం సమస్యలు ఉన్నట్లు తేలింది. కాగా మారిన ఆహారపు అలవాట్లు, విపరీతమైన పని ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి ఈ అనారోగ్య సమస్యలకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈక్రమంలోనే 30 ఏళ్లకే రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు యువతలో బయటపడుతున్నాయంటున్నారు. పట్టణాలు, నగరాలతో పాలు మారుమూల గ్రామాలు, పల్లెల్లోనూ ఈ జబ్బుల సమస్య ఉందంటున్నారు. కాగా ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, అతిగా జంక్‌ఫుడ్ తినడం తదితర కారణాలతో ఈ దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తలెత్తుతోందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో ముందు జాగ్రత్తగా 30 ఏళ్లు దాటిన వారు బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..