Konaseema: అంబేద్కర్ జిల్లా పేరుపై వివాదం.. కోనసీమ కాపు పెద్దలకు ముద్రగడ లేఖ

అంబేద్కర్ పేరును పెట్టినదానికి కోనసీమ పెద్దలకు అభ్యంతరం పెట్టడంలో న్యాయం ఉందా ఆలోచించమన్నారు ముద్రగడ. అంబేద్కర్ వంటి మహావ్యక్తి పేరు మన ప్రాంతానికి పెట్టినందుకు గర్వంగా ఫీలవ్వాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. 

Konaseema: అంబేద్కర్ జిల్లా పేరుపై వివాదం.. కోనసీమ కాపు పెద్దలకు ముద్రగడ లేఖ
Mudragada On Konaseema
Follow us

|

Updated on: Aug 08, 2022 | 1:59 PM

Konaseema: కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా ప్రభుత్వం పేరు మార్పచడంతో వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. పేరు మార్పుని వ్యతిరేకిస్తూ.. అమలాపురం వేదికగా భారీ స్థాయిలో ఆందోళనలు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా పేరు మార్పు వివాదంపై  మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. కోనసీమ పెద్దలకు ఓ లేఖ రాశారు. సమాజంలో అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. అయితే మనం మాత్రం వెనుకటి రోజులకు వెలుతున్నామో.. ఒక్కసారి ఆలోచించండని కోరారు. మన  మట్టిలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ ని..  యావత్తు భారతదేశంతో పాటు ప్రపంచమే కొనియాడుతుంది. అటువంటి మహావ్యక్తి పేరు కోనసీమకు పెట్టినందుకు అలజడులు సృష్టించడం న్యాయంగా లేదన్నారు. వీరి పేరు రాష్ట్రంలో ఎక్కడ పెట్టిన ఎవ్వరూ కాదనలేని పరిస్థితి అని తన భావనగా వ్యక్తం చేశారు. నిజానికి కోనసీమకు జి.యమ్.సి బాలయోగి పేరు పెట్టాలి. ఆయన లోక్సభ స్పీకర్ అయిన తరువాతనే మీ ప్రాంతం అభివృద్ధికి కారణమని చెప్పక తప్పదు. అయితే ప్రభుత్వం ఏదొక ఒక కారణంతో బాలయోగి  పేరును పరిగణనలోనికి తీసుకోలేదన్నారు ముద్రగడ.

ఉమ్మడి రాష్ట్రంలోనే కొందరి గౌరవ పెద్దల పేర్లు పెట్టడం, అలాగే విడిపోయిన తరువాత మన రాష్ట్రంలో మరికొన్ని జిల్లాలకు గౌరవ పెద్దల పేర్లు పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. అలా వారి పేర్లు పెట్టినంతమాత్రాన ఆ జిల్లాల్లోని ఆస్తులు ఆ పెద్దల ఆస్తులయిపోవు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మరి అంబేద్కర్ పేరును పెట్టినందుకు కోనసీమ పెద్దలు అభ్యంతరం పెట్టడంలో న్యాయం ఉందా ఆలోచించమన్నారు.  అంబేద్కర్ అటువంటి మహావ్యక్తి పేరు మన ప్రాంతానికి పెట్టినందుకు గర్వంగా ఫీలవ్వాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

బ్రిటిష్ పాలకుల కాలంలో కాటన్ దొరగారు ధవళేశ్వరంలో గోదావరికి ఆనకట్ట కట్టించారని ఆయన విగ్రహాలు గ్రామాల్లో, ఫోటోలు గృహాల్లో పెట్టుకుంటున్నారు.. ఆయన కుటుంబసభ్యులు ధవళేశ్వరం ఎప్పుడైనా వస్తే.. ఆహ్వానించి గౌరవం గా చూస్తున్నాం. మరి పరాయిదేశం వారిని ఇప్పటికి అభిమానిస్తూ, ప్రేమిస్తున్నామే మన దేశంలో పుట్టిన వారు మనందరికి హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం రాసిన డా॥ అంబేద్కర్  ని గౌరవించాలా? వద్దా అంటూ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

దయచేసి గౌరవ పెద్దలకు చేతులెత్తి నమస్కరిస్తూ మరొక సారి  కోనసీమ జిల్లా పేరు విషయంలో ఏర్పడిన వివాదాలకు ముగింపు పలికే విధంగా ప్రజాప్రతినిధులు, కాపు నేతలు తగిన రీతిలో ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నట్లు ముద్రగడ పద్మనాభం చెప్పారు, తాను ఏ  స్వార్ధంతోను ఈ ప్రతిపాదన చేయడం లేదన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..