Tomato Price: భారీగా పతనమైన టమాటా ధర.. ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల ఆందోళన.. టమోటాలు పారబోసి నిరసన

టమోటా ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. కిలో టమోటా ఐదు రూపాయలకు మించి పలకడం లేదు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్ లో టమాటా ధర తక్కువగా ఉన్నా.. వినియోదారుల వద్దకు వచ్చే సరికి రెట్టింపు ధరకు కొనుగోలు చేస్తున్నారు.

Tomato Price: భారీగా పతనమైన టమాటా ధర.. ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల ఆందోళన.. టమోటాలు పారబోసి నిరసన
Tomato Price
Follow us

|

Updated on: Aug 08, 2022 | 12:42 PM

Tomato Price Fall: ప్రస్తుతం ఏపీలో టమాటా ధర అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నచందంగా ఉంది. రైతు టమాటా అమ్మడానికి వెళ్తే.. తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అదే వినియోగదారులు కొనుగోలు చేయబోతే మాత్రం రెట్టింపు ధరకు కొనుగోలు చేస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లా, అనంతపురం, చిత్తూరు జిలాల్లో టమోటా ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. కిలో టమోటా ఐదు రూపాయలకు మించి పలకడం లేదు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్ లో టమాటా ధర తక్కువగా ఉన్నా.. వినియోదారుల వద్దకు వచ్చే సరికి మాత్రం  కిలో రూ. 12 నుంచి 15 రూపాయలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి మధ్య వ్యత్యాసం కర్నూలు జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు కర్నూలు రైతు బజార్ లో కిలో టమోటా 12 రూపాయలు ఉంది. రైతు అమ్మబోతే మార్కెట్ లో మాత్రం కేవలం ఐదు రూపాయలే పలుకుతోంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు అనంతపురంలో టమోటా రైతుల ఆందోళనల ఉద్రిక్తతకు దారి తీసింది. సీపీఎం, రైతు సంఘాలతో కలసి రైతులు టమోటా బాక్సులతో టవర్ క్లాక్ వద్ద ఆందోళన దిగారు. రోడ్డు పై టమోటాలు పారబోసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని సీపీఎంతో పాటు రైతు సంఘం నాయకులను అడ్డుకున్నారు. కాసేపు ఇరువురి మధ్య తోపులాట జరిగింది. చివరకు రైతు సంఘం నాయకులను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టమాటా రైతుల ఆందోళనలతో టవర్ క్లాక్ వద్ద ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి టమోటా రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళను ఉంటాయని ప్రభుత్వానికి హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..