Gorantla Madhav: గోరంట్ల న్యూడ్ వీడియో వ్యవహారంలో మహిళ ఫిర్యాదు.. అందులో ఉన్నది నేను కాదంటూ..

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఎంపి మాధవ్ న్యూడ్ వీడియోలో ఉన్న మహిళ తానే అంటూ దుష్ప్రచారం

Gorantla Madhav: గోరంట్ల న్యూడ్ వీడియో వ్యవహారంలో మహిళ ఫిర్యాదు.. అందులో ఉన్నది నేను కాదంటూ..
Mp Gorantla Madhav
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 08, 2022 | 12:39 PM

MP Gorantla Madhav: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో.. ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వీడియోపై టీడీపీ అధికారపార్టీని లక్ష్యంగా చేసుకుంటుండగా.. వైఎస్ఆర్సీపీ మాత్రం విచారణలో ఉందని.. నిజంగా అందులో ఉంది గోరంట్ల మాధవ్ అయితే చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ క్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఎంపి మాధవ్ న్యూడ్ వీడియోలో ఉన్న మహిళ తానే అంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ గాండ్లపెంట పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ట్విట్టర్ వేదికగా మాలతి రెడ్డి అనే యూజర్‌ మొదట పోస్టింగ్ చేయగా.. వేణు, చందు, రమణ, నవీన్ కుమార్ తదితర వ్యక్తులు ఫార్వర్డ్ చేశారంటూ ఫిర్యాదు చేసింది.

ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఆమె.. వైసీపీ సోషల్ మీడియాలో పని చేస్తున్నట్లు సమాచారం. కొత్తచెరువుకు చెందిన ఆమెకు గాండ్లపెంటకు చెందిన వ్యక్తితో వివాహం అయింది. దీంతో గాండ్లపెంట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది.

కాగా.. ఆమె ఫిర్యాదుపై గాండ్లపెంట సీఐ శంకర్‌ నాయక్‌ స్పందించారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి చట్టపరకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఎంపీ గోరంట్ల వీడియో వ్యవహారంపై వైసీపీ అధిష్టానం.. దృష్టిసారించింది. ఇప్పటికే ఈ వీడియోను ల్యాబ్ కు పంపించారు. అందులో ఉన్నది గోరంట్లా..? కాదా..? అని తేలిన తర్వాత చర్యలు తీసుకోనున్నారు. ఆ దిశగా సీఎం వైఎస్ జగన్ సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..